A real ghazini boy life story who is going back to his home after 39 years

A real ghazini boy life story who is going back to his home after 39 years, soudi arabia ghazini boy story, saudi arabia latest news, a boy going back his home after 39 years, ghazini boy, saudi boy story, saudi arabian boy ghazini story

A real ghazini boy life story who is going back to his home after 39 years

39 ఏళ్ల తరువాత ఇంటికి చేరుకున్న ‘గజిని’!

Posted: 07/05/2014 05:41 PM IST
A real ghazini boy life story who is going back to his home after 39 years

(Image source from: A real ghazini boy life story who is going back to his home after 39 years)

ఇదేదో సినిమా కథ కాదు బాబు... రియల్ లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్! అచ్చం గజిని సినిమాలాగే అతని జీవిత చరిత్ర కూడా గడిచింది. దేశదేశాలు తిరిగిన తరువాత దాదాపు 39 సంవత్సరాల తరువాత అతను తన స్వస్థలానికి చేరుకోబోతున్నాడు. అతనెవరో, ఎక్కడినుంచో వచ్చాడో, ఎక్కడి చేరుకోవాలన్న విషయాల గురించి ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తిని కోల్పోయిన అతను... ఇంటికి ఎలా చేరుకున్నాడో ఒకసారి వివరాళ్లోకి వెళ్దాం...

అది 1957వ సంవత్సరం. సౌదీ అరేబియాలో నివాసముంటున్న ఒక అబ్బాయి ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అతను ఆడుకుంటుండగా.. అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆ అబ్బాయి తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. తానెవ్వరో, ఎక్కడినుంచి వచ్చాడో, ఎక్కడి చేరుకోవాలన్న విషయాలను పూర్తి మరిచిపోయాడు. తన తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టని పరిస్థితి!

దీంతో ఆ అబ్బాయి ఏమి చేయాలో తోచక... కనిపించిన బస్సు ఎక్కాడు. దొరికిన ట్రెయిన్ ఎక్కాడు. సౌదీ అరేబియా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఆ అబ్బాయి... మొదట ఇరాక్ కు చేరుకున్నాడు. అక్కడున్న రోజులుండి తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇరాన్ కి, ఇరాన్ నుంచి పాకిస్తాన్ కి చేరుకున్నాడు. పాకిస్తాన్ లో తిరుగుతుండగా... అనుమానం వచ్చిన పోలీసులు ఇతనిని అరెస్ట్ చేశారు. టెర్రరిస్ట్ అని ముద్రవేసి ఒక సంవత్సరం వరకు జైల్లో కూడా వుంచారు. కానీ తరువాత ఇతని దీన పరిస్థితి తెలుసుకుని, పోలీసులు వదిలేశారు.

మళ్లీ అతను తన పాత పద్ధతినే కొనసాగించాడు. కనిపించిన బస్సు, దొరికిన ట్రెయిన్ ఎక్కుతూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అలా ప్రయాణంలో అనుకోకుండా ఒక ఇంటికి చేరుకున్నాడు. అతను మాట్లాడుతున్న భాష సౌదీ ప్రాంతానికి పోలీ వుండటంతో సదరు మహిళ అతని గురించి సౌదీ రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. ఇతని మీద పరిశోధనలు చేసిన అనంతరం... ఆ అబ్బాయిని (వ్యక్తి) సౌదీ అరేబియాకు చెందినవాడేనని తేల్చి పారేశారు. దీంతో వారు అతనిని సౌదీకి తిరిగి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక రియల్ గజినీ కథ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles