Tie knot between tdp and congress party in telangana state for jilla parishad elections

tie knot between Tdp and congress party in telangana state for jilla parishad elections, tdp and cogress party ties, tdp party latest news, chandrababu naidu latest news, chandrababu naidu with sonia gandhi, sonia gandhi with chandrababu naidu, jilla parishad elections in telangana, telangana state news, jilla parishad elections, tdp and congress party ties in telangana state for jilla parishad elections

tie knot between Tdp and congress party in telangana state for jilla parishad elections

‘ఉమ్మా’కు సై అంటున్న టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు

Posted: 07/05/2014 11:01 AM IST
Tie knot between tdp and congress party in telangana state for jilla parishad elections

(Image source from: tie knot between Tdp and congress party in telangana state)

అవును! ఈ విషయం నమ్మశక్యం కాకపోయినా... ప్రస్తుతం జగమెరుగని సత్యం. రాజకీయాల్లో ఇరుపక్షాల పార్టీలు ఎప్పుడు శత్రువులవుతారో, ఎప్పుడు మిత్రులవుతారో ఎవ్వరు అంచనా వేయలేరు. గతంలో ఎప్పుడూ ఒకరిమీద ఇంకొకరు నిప్పులు చల్లుకుంటూ, ఆరోపణలు వెల్లువెత్తకునే టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు... ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకుంటూ కలిసిపోతున్నారు.

జిల్లాపరిషత్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో పరస్పర పార్టీలు లబ్ది పొందడానికే ఇలా చేతులు కలుపుతున్నట్టు రాజకీయవర్గాలు తెలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఈ ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీలు కలిసిపొయ్యాయి. రంగారెడ్డి జడ్పీ పీఠాన్ని చెరో పార్టీ రెండున్నర సంవత్సరాల వరకు పాలించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా టీడీపీకి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మొహమాటం లేకుండా అంగీకరించింది.

బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ... ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో సీమాంధ్రలో అధికారాన్ని చేజిక్కించుకోగా... కాంగ్రెస్ పార్టీ మాత్రం పత్తాలేకుండా తుడుచుకుపోయింది. అలాగే కేంద్ర అధికారాన్ని కూడా చేజార్చుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కు తోచక అన్ని పార్టీలతో దోస్తీ చేసి, తిరిగి తన బలాన్ని పుంజుకోవడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే టీడీపీ పార్టీ కూడా తెలంగాణలో అధికారాన్ని పొందడానికి ఇలా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాలు బాబు... ఏది, ఎప్పుడూ, ఎలా జరుగుతుందో అస్సలు అర్థం కాదు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles