Rbi bank against waiver of crop loans in kcr government

kcr government, RBI bank, waiver of-crop loans, Telangana cm , telangna state, RBI against waiver of crop loans in telangana state, waiver of crop loans, RBI against, raghuramrajan rbi governor, telangana govt

RBI bank against waiver of-crop loans in kcr government

కేసిఆర్ సర్కార్ ని దెబ్బకొట్టిన ఆర్‌బీఐ !

Posted: 07/05/2014 10:39 AM IST
Rbi bank against waiver of crop loans in kcr government

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్ బీఐ నుండి గట్టి షాక్ తగిలింది. దీంతో కేసిఆర్ సర్కార్ అయోమయంలో పడింది. తెలంగాణలో రైతులు తీసుకున్న పంట రుణాల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధి ఇప్పుడు పెనుభారంగా మారింది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసిఆర్ సర్కారుకు ఆర్‌బీఐ నుంచి గట్టి షాక్ తగిలింది. రుణమాఫీ చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది.

రుణ మాఫీ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, బ్యాంకులను భాగస్వాములను చేయరాదని స్పష్టంచేసింది. రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ రీ షెడ్యూల్ జరిగితే తెలంగాణ రాష్ర్టంలో గత ఏడాది విపత్తుల భారిన పడ్డ 343 మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, ఆర్థిక‌శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన బృందం ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌ని కలిసి రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఇందుకు అధికారులు రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు సమాచారం. మాఫీ మొత్తాన్ని ఆరేడు సంవత్సరాల్లో వడ్డీ సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆర్‌బీఐ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యల కారణంగా బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం వ్యాఖ్యానించినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. 

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles