Dil raju big fight in telugu film chamber

dil raju big fight in telugu film chamber, heated ap filmchamber, ou students, trs wokers, ap filmchamber, telangana producers, dil raju.

dil raju big fight in telugu film chamber

తెలుగు ఫిలిం చాంబర్ లో దిల్ రాజ్ పైర్?

Posted: 07/05/2014 11:28 AM IST
Dil raju big fight in telugu film chamber

రాష్ట్ర విభజన విషయం ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. టాలీవుడ్ రెండుగా విడిపోవాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు పిలిం చాంబర్ పై తెలంగాణ విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు వందల సంఖ్యలో చేరి ఆందోళన చేపట్టారు. దీంతో తెలుగు ఫిలిం చాంబర్ లో తెలంగాణ మంటలు భగ్గుమన్నాయి. దీంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయరైంది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ నిర్మాత దిల్ రాజ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు.

దీంతో తెలంగాణ విద్యార్థులు , టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయి, తెలంగాణ ప్రొడ్యూసర్లకు మద్దతుగా.. ఇది ‘‘తెలుగు చాంబర్ కాదురా.. తెలంగాణ చాంబర్ రా..’’ అంటూ నినాదాలు చేస్తూ, దిల్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటం జరిగింది. దీంతో దిల్ రాజ్ శాతించి, వారితో మాట్లాడుకుందాం రండని చెప్పటంతో అక్కడ పరిస్థితి కొంచెం చల్లబడింది.

తెలుగు చాంబర్ లో జరుగుతున్న మీటింగ్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో సమావేశాలను అడ్డుకోవటం మంచిది కాదని.. అందరూ సమావేశమై చర్చిస్తామని దిల్ రాజు తెలిపారు.. మరో వైపు రెండు రాష్ట్రల సినీరంగ పెద్దలతో ఓ కమిటి వేసి రెండు రాష్ట్రలకు చాంబర్లు ఏర్పాటు చేయాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు. అయితే దిల్ రాజ్ హమీతో ఫిలిం చాంబార్ వద్ద నుండి విద్యార్థులును, టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లిపోవటంతో, తెలుగు ఛాంబర్ లోని సినీ నిర్మతలు, ప్రొడ్యూసర్లు ఊపీరిపిల్చుకున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles