Decision on creation of ap capital

decision on creation of ap capital, land acquisition posing problem in ap capital, ap state minister ke prabhakar talks about capital city

decision on creation of ap capital

రాజధాని ఎరుగని రాచరికం

Posted: 07/02/2014 05:52 PM IST
Decision on creation of ap capital

బయట పనైపోయిన తర్వాత ఎక్కడికి తిరిగిపోవాలో తెలియకపోతే ఆ రాజు ఏం పనిచెయ్యగలడు.  సభలు తీర్చటానికి, విధివిధానాలను నిర్ణయించటానికి రాజధాని చాలా అవసరం.  రాచరికం అంతరించి ప్రజాస్వామ్యం వచ్చినా, ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులైనా కార్యక్రమాలను నిర్వహించాలంటే అందుకు ఒ స్థలం కావాలి కదా.  దాన్నే ఇప్పటికీ రాజులు అంతరించినా ఇంకా రాజధాని అనే అంటున్నాం.  భాషలో ఏ పేరుతో వ్యవహరిస్తేనేంలే కానీ రాష్ట్రానికి సంబంధించిన పాలన యంత్రాంగాన్ని నడిపించటానికి ఒక కేంద్రం కావాలి కదా.  కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇదమిద్ధమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు.

విజయవాడ గుంటూరు మధ్యలోఅని ఊగిసలాడిన రాజధాని కాసేపు అమరావతి వైపు మళ్ళింది.  నిర్ణయం ఎందుకు జరగటం లేదు అంటే ముందుగా భూసేకరణ జరగాల్సి వుంది.  అందుకు ఇబ్బందులున్నచోట రాజధాని నిర్మాణం జరగటం కష్టం.  

రాష్ట్ర మంత్రి కెఇ కృష్ణమూర్తి రాజధాని విషయంలో మాట్లాడుతూ, ఇంతవరకు అధికారికంగా ఏ నిర్ణయమూ జరగలేదని, కేవలం కొన్ని ప్రతిపాదనలు, ఆలోచనలు మాత్రమే బయటకు వస్తున్నాయని అన్నారు.  రాజధానికి కావలసినంత స్థలం కూడా ఒకే చోట లభించే అవకాశం లేకపోవటం కూడా ఒక అడ్డంకే అవుతోందని మంత్రి అన్నారు.  

రాజధాని ఎక్కడన్నది నిర్ణయించటానికి కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డ కమిటీ కూడా వివిధ ప్రాంతాలను పరిశీలించింది కానీ నివేదికలో ఏదీ స్పష్టంగా తెలపలేకపోయిందని తెలుస్తోంది.  

అసలు ప్రస్తుతమున్న నగరాలలో ఏ నగరాన్నీ కాకుండా కొత్తగా ఏదైనా అటవీ ప్రాంతాన్ని ఎన్నుకున్నా కూడా దాన్ని డీఫారెస్టేషన్ కి అనుమతిస్తామని గత కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ సూచన కూడా చేసింది.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు రాజధాని విషయంలో ఎన్నో రకాల ప్రతిపాదనలున్నాయి.  వాటిలో ఏది ఎక్కువ అనుకూలమని నిర్ణయిస్తారో వేచి చూడాల్సివుంది.   అన్నిటికన్నా రాజధాని నిర్ణయంలో ఎక్కువగా భూసేకరణే ఎక్కువ అడ్డంకులను కలిగిస్తోందని మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles