Sunanda pushkar mysterious death

sunanda pushkar mysterious death, dr.sudheer gupta announcement on sunanda postmortem, aiims press meet to clarify dr sudheer’s statements, bjp leader subramaniam swamy talks about sunanda pushkar case

sunanda pushkar mysterious death

జటిలమౌతున్న సునంద పుష్కర్ కేసు

Posted: 07/02/2014 06:28 PM IST
Sunanda pushkar mysterious death

మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానస్పదంగా ఫైవ్ స్టార్ హోటల్లో మృతి చెందిన కేసులో అది సహజమైన మరణం కాదని మాత్రం రూఢి అవుతూనేవుంది కానీ అది హత్యా, ఆత్మహత్యా అన్నది తేలటం లేదు.  జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నం.345 లో రాత్రి 8.00 గంటల ప్రాంతంలో ఎఐసిసి సమావేశం అయిన అనంతరం శశి థరూర్ వచ్చి చూసేసరికి తన భార్య సునంద చనిపోయివుందని ఆయన అన్నారు.  

తాజాగా డాక్టర్ సుధీర్ గుప్తా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వటం మీద తన మీద వత్తిడి వచ్చిందని చెప్పటంతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, చూసారా నేను ముందు నుంచి చెప్తూనేవున్నాను, సునంద ది హత్యే నన్న అనుమానం నిజమైంది, దీని మీద లోతుగా దర్యాప్తు సాగించాలని చెప్తూ వస్తున్నా వినలేదు అని చెప్పటంతో ఎయిమ్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

డాక్టర్ నీరజ్ భాటియా తో కలిసి ఎయిమ్స్ పిఆర్ వో అమిత్ గుప్తా నిర్వహించిన మీడియా సమావేశంలో, సుధీర్ గుప్తా చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో ఆయన మీద ఎలాంటి వత్తిడీ తీసుకునిరాలేదని అన్నారు.  సునంద పుష్కర్ ఆటోప్సీ రిపోర్ట్ మార్చటం కోసం బయటి నుంచి ఎటువంటి వత్తిడీ రాలేదని కూడా ఆమె స్పష్టం చేసారు.  

Sunanda-and-Tharoor

డాక్టర్ నీరజ మాట్లాడుతూ, మాకు తెలిసినంత వరకు సునంద పుష్కర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మార్పులు చెయ్యటం జరగలేదని అన్నారు.  ఎయిమ్స్ అధికార ప్రతినిధి అమిత్ గుప్తా మాట్లాడుతూ, అవసరమైతే డాక్టర్ సుధీర్ గుప్తా మీద క్రమశిక్షణారాహిత్య చర్య తీసుకుంటామని అన్నారు.  డాక్టర్ సుధీర్ గుప్తా ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా పనిచేస్తున్నారు, ఆయనను పోస్ట్ లోంచి తొలగించే ప్రయత్నాలు ఏమీ జరగలేదని కూడా ఆయన తెలియజేసారు.  ఆయనను కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం, ఆయన సెలవులో ఉన్నారు కానీ ఆయనెక్కడికీ వెళ్ళిపోలేదు, ఆయన ఇంకా ఎయిమ్స్ లోనే బాధ్యతలను నిర్వహించటానికి ఉన్నారని అన్నారాయన.  డాక్టర్ సుధీర్ గుప్తాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ పోస్ట్ నుంచి ఎయిమ్స్ మేనేజ్ మెంట్ తొలగించే ప్రయత్నానికి నొచ్చుకుని సునంద పుష్కర్ వివరాలను బయటపెట్టారనే వార్త కూడా వినిపిస్తున్నందువలన దానికి సమాధానం పిఆర్ వో పై వివరణనిచ్చారు.

ఐపిఎల్ లో జరిగిన అవినీతిని సునంద పుష్కర్ బయటపెడతానని చెప్పటం వలనే ఈ ఘోరం జరిగిందని, ఏ దర్యాప్తూ లేకుండా ఆమె మరణించిన 24 గంటల్లో ఆమెకు అంత్యక్రియలు జరిగాయని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.  ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించిన గంటల్లోనే ఎయిమ్స్ నుంచి మీడియా సమావేశంలో పై ప్రకటనలు జరిగాయి.  

డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పినదాని ప్రకారం సునంద పుష్కర్ కి డ్రగ్ పాయిజనైతే జరిగిందని, అయితే అది హత్యా కావొచ్చు, లేదా ఆత్మహత్యా కావొచ్చని, దాన్నే తన నివేదికలో తెలియజేసానని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles