Jobs in parliament

jobs in parliament, jobs, parliament of india, printers posts, scale posts, joint recruitment cell, lok sabha secretariat, the joint recruitment cell

jobs in parliament

భారత పార్లమెంట్ లో పోస్ట్ లు

Posted: 07/02/2014 05:26 PM IST
Jobs in parliament

పార్లమెంటులో ఖాళీగా ఉన్న మొత్తం 16 పోస్ట్ లను భర్తీ చెయ్యటానికి లోక్ సభ సెక్రటేరియట్ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కి పిలుపునిస్తోంది.  దీనికి ఆఖరు తేదీ జూన్ 30 అయినా ప్రభుత్వోద్యోగంలో ఉన్నవారికి ఇంకా సమయం ఉంది.  వాళ్ళు ప్రాపర్ ఛానెల్ లో పంపటానికి మరో 7 రోజులు అదనంగా ఇవ్వటం జరిగింది.  కానీ ఎట్టి పరిస్థితులలోనూ జూన్ 30 తర్వాత ఏడు రోజుల తర్వాత వచ్చే అప్లికేషన్లను పరిశీలించటం కుదురదని చెప్పబడుతోంది.  విదేశాలలోను, ఈ క్రింది ప్రాంతాల నుంచి అప్లికేషన్లను పోస్ట్ ద్వారా పంపేవారికి కూడా 7 రోజులు అదనంగా అనుమతించటం జరుగుతోంది- అండమాన్ నికోబార్, లక్షద్వీప్, అస్సోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశే, మిజోరమ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో లాహోల్, స్పిటి జిల్లాలు, చంబా జిల్లాలో పంగి సబ్ డివిజన్ నుంచి.  

1.పార్లమెంటరీ ఇంటర్ ప్రెటర్ పోస్ట్ లు- వివిధ భాషలలో 9 ఇంటర్ ప్రెటర్ పోస్ట్ లు

పే స్కేల్ రూ.15600-39100 గ్రేడ్ పే రూ.5400

2. ప్రింటర్స్ – 5 పోస్ట్ లు

పే స్కేల్ రూ.5200-20200 గ్రేడ్ పే రూ.2800

3. వేర్ హౌస్ మన్ – 2 పోస్ట్ లు

పే స్కేల్ రూ.5200-20200 గ్రేడ్ పే రూ.2200

ఎంపిక విధానం – ఢిల్లీలో రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.  ఒకవేళ ఎక్కువ మంది అభ్యర్థుల అప్లికేషన్లు వచ్చి చెన్నై, ముంబై, కోలకతా సెంటర్లలో కూడా రాత పరీక్షను నిర్వహించవలసివస్తే ఢిల్లీలో కాకుండా ఆ ప్రాంతాలలో కూడా పరీక్షలను నిర్వహించబడతాయి.  

అప్లై చెయ్యవలసిన విధానం- ప్రకటించిన ఫార్మట్ లో ఇంగ్లీష్ లో కానీ హిందీ లో కానీ టైప్ చేసిన అప్లికేషన్లను ఆనా లైన్ లో పంపించాలి.  వేరే ఫార్మట్ లో ఉన్న అప్లికేషన్లను అంగీకరించబడవు.  అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకోవటానికి వెబ్ సైట్ http://www.loksabha.nic.in

ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ లకు అప్లై చెయ్యదలచుకున్నవారు విడివిడిగా అప్లికేషన్లను పంపవలసివుంటుంది.  

చిరునామా తప్ప అప్లికేషన్ లో మరే వివరాలను తర్వాత మార్చుకోవటానికి వీలుండదు.

హెచ్చరిక – ఏవిధమైన సిఫారసులను చేయించే ప్రయత్నం చేసినా అభ్యర్థుల అప్లికేషన్ ని పూర్తిగా తిరస్కరించబడుతుంది.  

చిరునామా

Parliament of India
(Joint Recruitment Cell)
Lok Sabha Secretariat
The Joint Recruitment Cell,
Room
No. 521, Parliament House Annexe,
New Delhi -110001

ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ లో రిక్రూట్ మెంట్ కింద చూడగలరు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles