Pv narasimha rao birth anniversary

pv narasimha rao birth anniversary, 93rd birth anniversary of pv, bharat ratna to pv narasimha rao, pv memorial bhavan, pv district in telangana, pv university in telangana

pv narasimha rao birth anniversary

పివి కి భారతరత్న ప్రతిపాదన

Posted: 06/28/2014 03:00 PM IST
Pv narasimha rao birth anniversary

ఈరోజు మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు 93 వ జయంతోత్సవాన్ని జరిపిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పివి ని ఎంత పొగిడినా తక్కువేనని ఆయన తెలంగాణా ఠీవి అని, భారతరత్న పురస్కారాన్ని ఇవ్వటానికి శాసనసభలో ప్రతిపాదన చేస్తానని అన్నారు.  

ఎన్నో భాషలలో ప్రావీణ్యమున్న పివికి ఎన్ని భారతరత్నలిచ్చినా తక్కువేనని అన్న కెసిఆర్, త్వరలో పివి మెమోరియల్ భవన నిర్మాణం జరుగుతుందని, వచ్చే సంవత్సరం ఆయన జయంతిని మరింత వేడుకగా చేస్తామని అన్నారు. పివి తో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా ఆయన రాజకీయ గమనంతోను, సాహిత్యగమనంతోనూ సాన్నిహిత్యముందని కెసిఆర్ అన్నారు.  ఆయన దేశంలో ఎన్నో ఆచరణాత్మకమైన విప్లవాత్మకమైన మార్పులను తీసుకునివచ్చారని, మొదటిసారిగా భూసంస్కరణ చట్టాన్ని తీసుకునివచ్చి మార్గదర్శకం చేసిన ఘనత పివికే దక్కుతుందని కూడా కెసిఆర్ అన్నారు.  ఇంకా, పివి పేరుని రాబోయే కాలంలో ఏర్పడే ఒక జిల్లాకి పెడతామని, ఆయన పేరుతో యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని కెసిఆర్ అన్నారు.  

పివి జయంతి సందర్భంగా పివి ఘాట్ లో తెలంగాణా ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ నరసింహన్ మరెందరో ప్రముఖులు నివాళులర్పించారు.  అక్కడ సర్వమత ప్రార్ధనలు జరిగాయి.  పివి కి భారతరత్న రావటానికి ప్రతిపాదనను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకునిపోతానని భాజపా సీనియర్ నాయకుడు దత్తాత్రేయ అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles