3 acres of land promised by kcr to dalits

mrps manda krishna objects kcr attitude, 3 acres of land promised by kcr to dalits, manda krishna says dalits will not pardon kcr

3 acres of land promised by KCR to dalits

30 ఎకరాలిచ్చినా కెసిఆర్ ని క్షమించరా?

Posted: 06/28/2014 01:37 PM IST
3 acres of land promised by kcr to dalits

దళిత కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున భూమినిస్తానని చెప్పిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటన మీద ఘాటుగా స్పందించిన ఎమ్ఆర్ పిఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ, 3 కాదు 30 ఎకరాలిచ్చినా దళితులు ఆయనను క్షమించరని అన్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని అన్న కెసిఆర్ మాటతప్పారని, దళితులకు అన్యాయం చేసారని, అందువలన కెసిఆర్ చేసిన మోసాన్ని 3 ఎకరాలతో కప్పిపుచ్చలేరని, 30 ఎకరాలిచ్చినా మర్చిపోరని అన్న మంద కృష్ణ రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా కంటితుడుపుగా 3 ఎకరాలివ్వటమేమిటని ప్రశ్నించారు.  ఆగస్ట్ 10 వ తేదీన 10 లక్షల మందితో దళిత ఆత్మగౌరవ సభను నిర్వహిస్తామని ప్రకటించారు.  

అయితే, దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని అన్న కెసిఆర్ ఎన్నికల తర్వాత ఆ ఊసెత్తకపోవటంతో దుమారం లేపుతున్న దళితనాయకులను ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పకపోయినా, తాను పగ్గాలు చేపట్టటానికి కారణాలను ఆయన వివరించారు.  రాష్ట్రం విడిపోయినంత మాత్రాన పోరాటం ముగియలేదని, ఇంకా నీళ్ళు, కరెంటు, ఉద్యోగాలు, పోలవరం లాంటి విషయాలలో కేంద్రంతో ఎంతో కొట్లాడాల్సింది ఉందని, ఆంధ్రావాళ్ళను నమ్మటానికి లేదని, అందువలన పోరాటాన్ని పటిష్టంగా చెయ్యగల సామర్థ్యం ఉన్నవాళ్లే నాయకత్వాన్ని వహించాలని తన అభిప్రాయాన్నికెసిఆర్ అప్పుడే వివరంగా తెలియజేసారు.

అంటే దళితులలో నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్నవాళ్ళే లేరనా, ఎప్పుడూ దొరలే రాజ్యమేలాలా అని కూడా విమర్శలు వచ్చాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles