Amit shah chances for bjp president

amit shah chances for bjp president, modi confidential person amit shah, amit shah efforts to make modi pm, modi strength increases with amit shah as party president

amit shah chances for bjp president

భాజపా అధ్యక్షుడి పేరు ఖరారు

Posted: 06/28/2014 03:25 PM IST
Amit shah chances for bjp president

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నరేంద్ర మోదీ సన్నిహితుడు అమిత్ షా పేరు ఖరారైందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.  ఒక వారం రోజుల్లోనే ఈ ప్రకటన కూడా వెలివడబోతోంది.  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన అమిత్ షాను అధ్యక్షపదవిలో కూర్చోబెట్టటం పార్టీలో ఆయనకు సంక్రమించిన ప్రాబల్యంగా కనపడుతోంది.  దీనివలన మోదీకి ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోనూ పట్టు చిక్కినట్లే.  వారణాసిలో మోదీ విజయం వెనుక అమిత్ షా కృషి చాలా ఉంది.  

గుజరాత్ లో  మోదీ క్యాబినెట్ లో పనిచేసిన అమిత్ షా 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల మూలంగా ఎన్నికల కమిషన్ ఆయనను గుజరాత్ లో ప్రచారం చెయ్యరాదని నిషేధించింది.  అయినా ఆయన మోదీని గెలిపించటమే లక్ష్యంగా ముందుకెళ్ళి వారణాసిలో మోదీకి బాటలు వేసారు.  

అమిత్ షా పార్టీ పగ్గాలను చేపట్టటంతో ప్రధాని మోదీకి పని చెయ్యటానికి మరింత సానుకూల పరిస్థితి, మరింత స్వేచ్ఛ లభిస్తుందనటంలో అనుమానం లేదు  

Related article Link with: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/53777-amit-shah-as-new-bjp-president.html

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles