Telangana government stops coal supply to ap

Telangana Government stops Coal supply to AP, Electricity Vs Coal, chandrababu vs kcr, andhrapradesh vs telangana, Coal linkage, short supply for three power plants, Andhra Pradesh, RTPPS, NTTPS, MCL, NTPC

Telangana Government stops Coal supply to AP, Electricity Vs Coal

మాతో పెట్టుకుంటే.. బాబుకు బొగ్గు కట్?

Posted: 06/24/2014 08:17 AM IST
Telangana government stops coal supply to ap

ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మద్య పవర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి దీటుగా.. తెలంగాణ గవర్నర్ పావులు కదుపుతుంది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు పై ప్రతీకార చర్యగా.. తెలంగాణ ప్రభుత్వం.. తెరపైకి మరొ కొత్త వివాదం తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను సింగరేణి నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల సుమారు 1200-1300 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం కడప, విజయవాడ ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని సమాచారం. పీపీఏ రద్దుకు ప్రతిచర్యగా అనే అనుమానం వ్యక్తమౌతోంది.ఇటీవల పీపీఏలను రద్దు చేయాలని ఏపీ జెన్ కో కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈఆర్సీకి లేఖ రాసింది. దీనిని ఈఆర్సీ తిరస్కరించింది. పీపీఏలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందున రెండు రాష్ట్రాల డిస్కంలు కలిసి కోరితేనే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కానీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగు జెన్ కోలకు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. లేఖ ప్రతిని ఈఆర్సీకి సమర్పించింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేగేసి చెబుతోంది. తమ మధ్య చేసుకున్న ఒప్పందాలు విద్యుత్‌ నియంత్రణ మండలి ఆమోదించనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెన్ కో లేఖలో స్పష్టంగా పేర్కొంది. తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ కేటాయిస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్తును కేటాయించింది. దీంతో విద్యుత్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది.

ఈ నేపథ్యంలోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. 2009లో సమర్పించిన ఒప్పందాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. నిజానికి ఈ ఒప్పందాలను కమిషన్ ఆమోదించలేదు. 2009లో సమర్పించిన ఒప్పందాలను కమిషన్ ఆమోదించకపోయినప్పటికీ, ఆ ఒప్పందాల ఆధారంగానే విద్యుత్ పంపిణీ, కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల మద్య ముదురుతున్న వివాదం ఎప్పుడు చల్లబడుతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles