Flipkart to hire 12000 people in 2014

Myntra,Flipkart recruitment,Flipkart hiring,Flipkart

Flipkart will hire 12,000 people this year to beef up its support and technology operations as the homegrown firm witnesses strong surge in online shopping in the country.

ఫ్లిప్ కార్టులో త్వరలో ఉద్యోగాల జోరు

Posted: 06/23/2014 08:00 PM IST
Flipkart to hire 12000 people in 2014

మీరు బీటెక్ లు, ఎంటెక్ లు చదివి ఐటీ ఉద్యోగాల వేటలో ఉన్నారా? ట్యాలెంటు ఉండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రావడం లేదా ? అయితే కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మీకు అర్హత, ట్యాలెంట్ ఉంటే మీకు ఈ ఉద్యోగం రావచ్చు. అవును... త్వరలో ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ మార్కెటింగ్ సంస్థ అయిన ఫ్లిప్ కార్టు సంస్థ 12 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకొవడానికి రెడీగా ఉంది.

ప్రపంచ దేశాల్లోకెల్లా ఇంటర్నెట్ వినియోగంలో మూడో స్థానంలో ఉన్న ఈ ఈకామర్స్ సంస్థ భారతదేశంలో తన మార్కెట్ ను పెంచుకోవాలని, దానికి తగిన సాంకేతికను సమకూర్చుకోవడానికి ప్రస్తుతం పనిచేస్తున్న 13000 మంది సిబ్బందిని 25,000 వేలకు పెంచుకోవాలని నిర్ణయించినట్లు ఫ్లిప్ కార్టు చీఫ్ పీపుల్ ఆఫీసర్(సీపీవో) మేకిన్ మహేశ్వరి చెప్పారు. త

మ అవసరాలకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు, ఏడాదిలో ఒక్క ఇంజనీరింగ్‌లోనే 1,200 మందికి అవకాశమివ్వబోతున్నట్లు వెల్లడించారు. . తన వ్యాపారాన్ని 30 పట్టణాలకు విస్తరించి, అమ్మకం దారుల కూడా 12000 కు పెంచుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్లు చెప్పారు. . గత నెలలో దుస్తుల విక్రయ ఆన్‌లైన్ సంస్థ మింత్రాను ఫ్లిప్ కార్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,000 కోట్లను వెచ్చించింది. దీనిని బట్టి రానున్న రోజుల్లో ఐటీ రంగంలో కూడా అవకాశాలు మరింత జోరందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles