Notices not required for illegal constructions kcr says

No notices for illegal constructions KCR says, GHMC can demolish unauthorized constructions, An inch should not be left in grabbed land, Telangana CM KCR strict on land grabbers

Notices not required for illegal constructions KCR says

అనుమతే లేని కట్టడాలను కూల్చటానికి నోటీసులెందుకు- కెసిఆర్

Posted: 06/24/2014 09:26 AM IST
Notices not required for illegal constructions kcr says

జంట నగరాలలో అక్రమ నిర్మాణాల మీద దృష్టి సారించిన తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావు, అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాల విషయంలో నోటీసులు కూడా ఇవ్వవలసిన పని లేదని, నేరుగా వెళ్ళి కూల్చివేయమని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఆదేశాలిచ్చారు.  

అందుకు నాందిగా ఈ రోజు ఉదయం మాదాపూర్ లోని గురుకుల ట్రస్ట్ లో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.  పరిస్థితిని అదుపులో ఉంచటం కోసం అక్కడ పోలీసులు భారీగా మోహరించివున్నారు.  

అనుమతే లేకుండా కట్టినదానికి ముందస్తు నోటీసులు ఎందుకు అని కెసిఆర్ ప్రశ్నించారు.  అనుమతులుండి నిబంధనలను ఉల్లంఘించి చేసిన నిర్మాణాల విషయంలో మాత్రం నోటీసులివ్వవచ్చని, అసలు అనుమతులే లేని నిర్మాణాలను ఉపేక్షించవలసిన అవసరమే లేదని, జంట నగరాల్లో అంగుళం కూడా వదలవద్దని, ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలను సత్వరం కూల్చివేసి ప్రభుత్వానికి అప్పజెప్పమని కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.  

అక్రమ కట్టడాలకు సహకరించినవారినీ కఠినంగా శిక్షించాలని అన్న కెసిఆర్, అటువంటి నిర్మాణాలకు విద్యుత్, త్రాగునీరు ఇవ్వటం కూడా అక్రమమేనని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles