Over 8000 people salute sun with yoga in new york s times square

Summer solstice at NY Times Square, people salute sun with yoga in New York, 11000 participated in Solstice Yoga at Times Square

Over 8000 people salute sun with yoga in New York-s Times Square

8 వేల మంది ఒకేసారి ఇలా చేశారు?

Posted: 06/23/2014 05:34 PM IST
Over 8000 people salute sun with yoga in new york s times square

సంవత్సరంలో రెండు సార్లు- దక్షిణాయనం, ఉత్తరాయణాలలో పగటి పూట ఎక్కువ సమయం ఉండే రోజులుంటాయి.  అందులో భారతదేశంలో హిందువులు ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తారు.  భూమి ఒక పక్క నుంచి మరో పక్కకి ఒరిగినప్పుడు ఈ ఆయనాలు సంభవిస్తాయి.  వేసవిలో సంభవించే ఆయనాన్ని మిడ్ సమ్మర్ (మధ్య వేసవి) అని కూడా అంటారు.  శనివారం జూన్ 21 న ఉత్తర భూభాగంలో వేసవిలో సంభవించే అతి పెద్ద పగటి రోజు కావటంతో ఆరోజు అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో ఉచిత యోగా తరగతులు నిర్వహించబడ్డాయి.  ఆ రోజు లండన్ లో పగలు 16 గంటల 38 నిమిషాలు ఉండటం విశేషం.  తిరిగి మళ్ళీ దక్షిణ భూభాగంలో ఆయనం డిసెంబర్ 20, 23 మధ్యలో సంభవిస్తుంది.  

ఇది న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో నిర్వహించిన 12 వ ఆయనం వేడుక.  ఇందులో భాగం వహించినవారు 8000 నుంచి 11000 వరకు ఉన్నారని అంచనా.  న్యూజెర్సీలోని వేన్ కి చెందిన 25 సంవత్సరాల క్రిస్టినా సిలూస్నియాక్ అనే యోగా శిక్షకురాలు ఈ సందర్బంలో మాట్లాడుతూ, యోగా ఆచారంలో సూర్యుని పూజించటం ఆనవాయితీగా వస్తోందని అన్నారు.  


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/yogaclassinnewyork

హిందువులు సూర్యుని ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు.  అంటే మనకు కనిపించే దైవం అని అర్థం.  లోకంలో వెలుగనేది లేకపోతే మరేమీ ఉండదు కనుక సూర్యుని దైవంతో సమానంగా పూజిస్తూ, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కనుక ప్రత్యక్ష నారాయణుడని పిలుస్తారు.  

యోగాకి, సూర్యునికి ఉన్న సంబంధం ఏమిటంటే, 1. ప్రాతక్కాలంలో చేసిన యోగా సత్ఫలితాలనిస్తుంది. 2. ఉదయం చేసే యోగా వలన ఆక్సిజన్ ఎక్కువ పాళాల్లో శరీరానికి పడుతుంది.  3. ఉదయం ప్రసరించే సూర్య కిరణాలలో శక్తి ఎక్కువగా ఉంటుంది.  4. ఏ పనికైనా ఆధ్యాత్మికతను ముడిపెట్టటం వలన మనసులో కల్మషం లేకుండా పవిత్రమైన భావన ఉండే అవకాశం ఉంటుంది.  అందువలన సూర్యోదయం సమయంలో సూర్యునికి అభిముఖంగా సూర్యనమస్కారాలు చెయ్యమని యోగాలో సూచించారు.  అది 12 అతి ముఖ్యమైన ఆసనాలతో కూడినది.  ఎక్కువ సమయం లేని వారు ఆ 12 ఆసనాలను సూర్యదేవుని 12 నామాలతో స్మరిస్తూ చెయ్యమని సూచిస్తారు.

టైమ్స్ స్క్వేర్ అలియన్స్ అధ్యక్షుడు టిమి టాంమ్ప్ కిన్స్ మాట్లాడుతూ, అన్ని చోట్ల కంటే టైమ్స్ స్క్వేర్ లో మనసుని నిలిపి యోగా చెయ్యటమే పెద్ద సవాల్ అని అన్నారు.  మనసుని నిలపటం కూడా యోగా ప్రక్రియలో భాగమే.  మామూలు సమయంలో శరీరంలో భాగాలన్నిటికీ సమానంగా ప్రసరించే శక్తి యోగాలో అతి కీలకమైన ప్రాణాలను రక్షించే శరీర భాగాలకు ఎక్కువ శక్తిని సమకూర్చటం కోసం తయారు చేసినవే యోగాసనాలు.  శరీరంలోని కొన్ని భాగాల మీద సున్నితమైన వత్తిడిని కలిగించటం ద్వారా దానితో ముడిపడ్డ అతి ముఖ్యమైన శరీర భాగాలకు శక్తి ఎక్కువ పాళల్లో ప్రసరిస్తుంది.  దాని వలన శరీరం ఆరోగ్యం ఉంటుందని యోగా శాస్త్రంలో చెప్తారు.  

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles