Militants attacks in kenya

Militants attacks in Kenya, Inhuman killing in Kenya, Militants kill men in front of women in Kenya, Non Muslims in Kenya targeted

Militants attacks in Kenya

ముస్లిం కాదా, సోమాలి మాట్లాడవా అయితే చావు- కెన్యాలో దారుణం

Posted: 06/17/2014 02:46 PM IST
Militants attacks in kenya

నిన్న రాత్రి కెన్యాలోని మ్పేకెటోని గ్రామవాసులు ఎంతో ఆసక్తిగా టివిలకు అతుక్కుపోయి వర్ల్ డ్ కప్ సాకర్ మేచ్ చూస్తున్న సమయంలో 48 మందిని హతమార్చిన సోమాలి ఉగ్రవాదులు ఒకరి ఆగడం చూసి మరొకరు రెట్టించిన ఉత్సాహంతో పాల్పడిన దారుణకాండ బహిర్గతమవటంతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది.

kenya-attack-4

kenya-attack-6

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం 30 మంది వరకూ సాయుధులైన మిలిటెంట్లు మిని బస్ లో వచ్చి ముస్లిం కాదని తెలిసినవాళ్ళందరినీ మట్టుపెట్టటం మొదలుపెట్టారు.  

mpeketone-map

అన్నే గతెగి అనే యువతి చెప్పినదాని ప్రకారం రాత్రి 8.00 గంటల ప్రాంతంలో తలుపు కొట్టి మీరు ముస్లింలా అని అడిగారు.  కాదు క్రిస్టియన్స్ అని తలుపు తీసిన ఆమె భర్త చెప్పిన వెంటనే వాళ్ళు తలలోను, గుండెల్లోను తుపాకీతో కాల్చి చంపారు.  

kenya-attack1

మరో సంఘటనలో జాన్ వేవోరు చెప్పిన దాని ప్రకారం అతని ఇద్దరు సోదరులను కాల్చే ముందు వాళ్లు సోమాలి భాష తెలియనివారని తెలుసుకుని వెంటనే చంపేసారు.  అతని సోదరులు పక్కింట్లో ఉంటారని, ఆ ఇంటి తలుపుకొట్టటం, వాళ్ళతో సోమాలిలో మాట్లాడటం, దానికి సోమాలి తెలియని తన సోదరులు ఆ భాషలో తిరిగి జవాబివ్వలేకపోవటంతో వాళ్ళ  శరీరాల్లో బుల్లెట్లు నింపటం తాను కిటికీ లోంచి స్పష్టంగా చూసానని చెప్పాడు.  

kenya-attack-3

బ్రీజ్ వ్యూ హోటల్ దగ్గర మిలిటెంట్లు మగవాళ్ళందరినీ ఒక పక్కకు నిలబెట్టి వాళ్ళని ఆడవాళ్ళ సమక్షంలో దారుణంగా చంపారు.

kenya-attack-2

దుండగులు వెళ్ళిపోయేముందు వాహనాలను దగ్ధం చేసారు, రెండు హోటళ్ళను కూడా ధ్వంసం చేసారు.

kenya-attack1

kenya-attack-5kenya-attack1

మ్పేకెటోని పట్టణం పర్యాటక స్థలమైన లాము కి 30 కిలోమీటర్ల దూరంలోను, సోమాలి సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలోను, కెన్యా రాజధాని నైరోబి కి 600 కిలోమీటర్ల దూరంలోను ఉంది.  

lamu-tourist-place

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles