Minister narayana unhappy cabinet ministers portfolios

minister narayana unhappy, Cabinet Ministers Portfolios, CM chandrababu naidu, AP Chief Minister Chandrababu Naidu, Educationist P Narayana, 19 ministers,,

minister narayana unhappy Cabinet Ministers Portfolios

నారాయణకు ఆశాఖ ఇస్తే గోవిందే?

Posted: 06/11/2014 04:11 PM IST
Minister narayana unhappy cabinet ministers portfolios

రాజకీయ ప్రాక్టీస్ లేకుండానే.. చంద్రబాబు చెయ్యి పట్టుకొని మంత్రి ఛాన్స్ దక్కికున్నారు. డబ్బులకు చదువు చెప్పే బడుల దర్శకుడు.. నారాయణ(నారాయణ కార్పొరెట్ విద్యా సంస్థల అధినేత) ఈయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు.ఒక్క విద్యార్థులకుతప్పితే. అలాంటి నారాయణ ఇప్పుడు సీమాంద్ర ప్రజలకు సేవ చేయటానికి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ పదవి కోసం ఎంత డోనేషన్ కట్టారనేది మాత్రం చీకటి రహస్యం.

అయితే ఈరోజు చంద్రబాబు క్యాబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. కానీ తమకు దక్కిన శాఖల పై చాల మంది అసంత్రుప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో నారాయణ ఒకరు. ఆయనకు విద్యాశాఖ వస్తుందని అందరు అనుకున్నారు. నారాయణ కూడా చాలా ఆశపడినట్లు తెలుస్తోంది. కానీ చివరకు .. నారాయణకు.. పురపాలక శాఖ (సీమాంద్రలో చెత్త లేకుండా చేసే శాఖను ఇవ్వటం జరిగింది) దీంతో ఆయన షాక్ తిన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నారాయణకు మంత్రి ఇచ్చినప్పటికి నుండి కొన్ని విమర్శలు వినిస్తున్నాయి. ఒకవేళ నారాయణ కు విద్యాశాఖ ఇస్తే.. గనుక ఇక గోవిందే అంటూ కొంతమంది ప్రముఖులు పెదవి విరిచారు. ఆయన ఇప్పటికే శ్రీ చైతన్య, నారాయణ,అంటూ విద్యా సంస్థలు రాష్ట్రాంలోఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.చదువును బిజినెస్ గా మార్చుకున్నా కోట్లు సంపాదించుకున్న వ్యక్తి నారాయణ. అంతేకాకేండా. చదువు పేరిట.. వేలు వేలు దండుకుంటూ, విద్యార్థులను హింసపెడుతున్న సంస్థలపై ..బాలల హక్కుల సంఘం వాళ్లు పైట్ చేస్తూనే ఉన్నారు. కానీ నారాయణలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

అయితే ఈరోజు మంత్రి నారాయణకు పురపాలక శాఖ రావటంతో.. బాలల హక్కుల సంఘం వాళ్లు, కొంతమంది ..విద్యావేత్తలు ఊపీరి పిల్చుకున్నారు. మంత్రి నారాయణ కూడా తనకువిద్యశాఖ దక్కలేదని ..చంద్రబాబు పై అలిగినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబును కలిసిందుకు మంత్రి నారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.దీనికంటే..చంద్రబాబుకు..పార్టీలోని సీనియర్ నేతలు.. నారాయణకు విద్యశాఖ ను ఇవ్వొద్దని మొరపెట్టుకున్నట్లు ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనిపై చంద్రబాబు నారాయణకు ఎలా సర్థిచెబుతాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles