Tamilnadu governor k rosaiah not coming to hyderabad

K Rosaiah Not Coming to Hyderabad, Rosaiah Not Coming to Hyderabad, Tamilnadu Governor K Rosaiahm, Governor Rosaiah, Konijeti Rosaiah.

Tamilnadu Governor K Rosaiah Not Coming to Hyderabad

రోశయ్య గారిలో గులాబీ భయం?

Posted: 06/11/2014 05:21 PM IST
Tamilnadu governor k rosaiah not coming to hyderabad

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు ..మొహం చాటేశాడు. తమిళనాడు గవర్నర్ గా వెళ్లిన తరువాత అనేక సార్లు హైదరాబాద్ కు వచ్చి మీడియాకు ఫోజులిచ్చిన రోశయ్య సార్.. ఇప్పుడు పూర్తి రావటమే మానుకున్నారు. గతంలో..హైదరదాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన అక్కడ రోశయ్య ఒక వెలుగు వెలిగేవారు. చివరకు రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమాల్లో రోశయ్య గారు దూరమైనట్లు తెలుస్తోంది.

ఒకవేళతమిళనాడుగవర్నర్ కాబట్టి అక్కడి రాజకీయలో కుస్తిపడుతున్నాడేమో అనిఅనుకుంటే..అలాంటి వాతావరణం తమిళనాడుముఖ్యమంత్రి జయలలిత కల్పించలేదు. ఒకవేళ తమిళ్ నేర్చుకుంటూ ఉన్నాడేమోఅని ఆయన అభిమానులుఅనుకుంటున్నారు.కానీ అసలు విషయం అదికాదట. ఎన్నికల తరువాతరాజకీయ పరిస్థితి మారిపోయిన విషయం తెలిసిందే. అందులోను ..హైదరాబాద్ మొత్తం గులాబీ బాస్ చేతిలోకి వెళ్లిపోవటంతో రోశయ్య రాకపోకలు కొంచెం తగ్గించాడని ఆయన అభిమానులు అంటున్నారు.

అంతేకాకుండా ..రోశయ్య గవర్నర్ పదవి కూడా మూడు నాళ్ల ముచ్చటే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలే రోశయ్యకు వయసు మీదపడింది. దీంతో కొత్త రిస్క్ లు చేయటం ఎందుకు అనుకున్నాడో ఏమో? తమిళనాడు రాజ్ భవన్ కే పరిమితం అయినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. హైదరాబాద్ కు రోశయ్యను పిలిచేవారి సంఖ్య బాగా పడిపోవటమే కారణమని తెలుస్తోంది. అందుకే ఇటువైపు రావటానికి పాపం పెద్దాయన మొహం చాటేసినట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles