Capital between vijayawada guntur confirms naidu

Andhra Pradesh new capital near Guntur, AP new capital near Guntur, Chandrababu Naidu announced new capital place, Chandra Babu, New Capital, Seemandhra, Vijayawada-Guntur, Counter to Jagan's Open Letter, Clarifies on the cost of Swearing-in, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ-గుంటూరు, 10 స్మార్ట్ సిటీ, 100 స్మార్ట్ సిటీల.

Capital Between Vijayawada Guntur Confirms Naidu, Andhra Pradesh new capital near Guntur, hints CM Chandrababu Naidu

సీమాంద్ర రాజధాని ఇక్కడే ఉంటుంది? చంద్రబాబు

Posted: 06/10/2014 02:58 PM IST
Capital between vijayawada guntur confirms naidu

ఎట్టకేలకు.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీమాంద్ర రాజధాని ఎక్కడ అనేదానికి .. కొంత తెర దించారు. ఇప్పటివరకు .. సీమాంద్ర రాజధాని ఏ ప్రాంతంలో ఉంటుందోనని.. సీమాంద్ర ప్రజలు, నేతలు ఎదురుచూసిన విషయం తెలిసిందే. అందరికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఇదే అని చంద్రబాబు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా విజయవాడ-గుంటూరు ప్రాంతం అనువైనదని చంద్రబాబు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలను కలిపితే హైదరాబాద్ స్థాయిలో నగరం రూపొందుతుందన్నారు. ఇక్కడ రైతుల నుంచి సేకరించిన భూమికి 60 శాతం మేర పరిహారం చెల్లించి, మిగిలిన 40 శాతం మేర వేరే ప్రాంతంలో వారికి భూమిని కేటాయిస్తామని. అందులో రోడ్లు, విద్యుత్ సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

guntur-seemandhra-new-capital

దానివల్ల ఆ భూమికి మంచి ధర వస్తుందని వివరించారు. అప్పటికీ భూ సేకరణ కష్టమైతే రాజధాని కోసం వేరే ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టనున్న 100 స్మార్ట్ సిటీల జాబితాలో వీటిని కూడా చేర్చాలని కోరతామని తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles