Minister ganta srinivasa rao meets on cm channdrababu naidu

minister ganta srinivasa rao meets on cm channdrababu, minister ganta srinivasa rao meets on cm, minister ganta srinivasa rao, Andhra Pradesh CM Chandrababu Naidu, Ganta Srinivasa Rao, మంత్రి గంటా పనితీరు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.

minister ganta srinivasa rao meets on cm channdrababu naidu

మంత్రి గంటా పనితీరు..

Posted: 06/10/2014 01:44 PM IST
Minister ganta srinivasa rao meets on cm channdrababu naidu

మంత్రి గంటా శ్రీనివాసరావు.. నక్క తోకను .. జేబులో పెట్టుకొని తిరుగతున్నాడని.. సైకిల్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో అడుగు పెడితే.. ఆ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇస్తుందని సైకిల్ నేతలు ఈర్ష్యపడుతున్నారు.

ప్రజారాజ్యం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి కలిసినప్పుడు మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఇప్పుడు హస్తం వదిలేసి .. సైకిల్ ఎక్కిన వెంటనే.. మంత్రి పదవి వరించింది. అంతా గంటా అద్రుష్టం అని అంటున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు లో ప్రజలను సంత్రుప్తి పరిచే విధంగా పనిచేసే తీరే అందరికి నచ్చుతుంది. అంతేకాకుండా .. ప్రజాప్రతినిదుల పని తీరు బాగుండాలని గంటా కోరుకోవటమే.. ఆయనకు పదవులను తెచ్చిపెడుతున్నాయని సైకిల్ బాబులు అంటున్నారు.

అయితే ఈరోజు మంత్రి గంటా .. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. ఆతరువాత గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. 12న తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరపాలని నిర్ణయించినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

తమకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో పనిచేస్తామని గంటా చెప్పారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం టీఎల్ఎన్ సభా హాలులో తొలి మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles