Cm chandrababu naidu fire on cm kcr for polavaram project

cm chandrababu naidu fire on cm kcr, chandrababu naidu fire on cm kcr, polavaram war, polavaram project, హూ ఆర్ యూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చంద్రబాబ కేసిఆర్ ను ప్రశ్నించారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.

cm chandrababu naidu fire on cm kcr for polavaram project

హూ ఆర్ యూ? నీకేంటి సంబంధం?

Posted: 06/10/2014 08:14 AM IST
Cm chandrababu naidu fire on cm kcr for polavaram project

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ను హూ ఆర్ యూ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు?..హూ ఆర్ యూ?, మీకేంటీ సంబంధం?..’ అని చంద్రబాబ కేసిఆర్ ను ప్రశ్నించారు.

చంద్రబాబు తన నివాసంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రానీయకుండా కెసిఆర్ అడ్డం పడడం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలో ముంపునకు గురయ్యే గ్రామాలు ఏమీ లేవని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని కడుపు మంట మాటలు ఏమిటని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాల్సి ఉందని, ఆ దిశగా పాజిటివ్‌గా ఆలోచన చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో విద్యుత్తు లోటు ఉంది కాబట్టి ఇచ్చే పరిస్థితి రావాలని అన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గులాబీ దళం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలవరం వల్ల..తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి కేసిఆర్ మాట్లాడుతున్నాడని అన్నారు. అవసరమైతే..మళ్లీ ఉద్యమం చేసి పోలవరం కట్టకుండా ఆపే సత్తా మాకుందని టీఆర్ఎస్ నేతలు బాబు పై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలవరం వార్ మొదలైనట్లు తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles