Bjp top leaders visiting vijayawada

BJP top leaders visiting ViJayawada, Chandra Babu swearing in ceremony at Guntur, BJP leaders CMs to attend Babu swearing in

BJP top leaders visiting ViJayawada to attend Babu swearing in ceremony

బెజవాడకి భాజపా నేతలు దిగివస్తున్న వేళ!

Posted: 06/07/2014 09:13 AM IST
Bjp top leaders visiting vijayawada

భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలంతా రేపు విజయవాడకు దిగివస్తున్నారు.  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరోత్సవాన్ని తిలకించటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అశక్తతను తెలియజేసినా, ఢిల్లీ నుంచి భాజపా నేతలు మాత్రం ప్రమాణ స్వీకార వేడుకకు వస్తున్నారు.  వారు, ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ తదితరులు.

ఇక ముఖ్యమంత్రులలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవటం వలన ఆయన రాలేకపోతున్నారని సమాచారం అందించారు.  ఆయన ఢిల్లీలో ప్రధాన మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తానని అన్నారు.  కాకపోతే ఆ ఇతర మంత్రులు కూడా ఇక్కడికే వచ్చేస్తున్నారు.  పంజాబ్, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్ గఢ్, గోవా నుంచి ముఖ్యమంత్రులు రానున్నట్లుగా సమాచారం.  

ముఖ్య అతిథులకు కావలసిన ఏర్పాట్లను చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ చూసుకోనున్నారు.  

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటి ఎదురుగా ఉన్న 70 ఎకరాల ఖాళీ జాగాలో ఆరు రోజుల్లోనే 5 లక్షల మంది అతిథులకు అవసరమైన ఏర్పాట్లన్నీ శరవేగంగా జరిగిపోయాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles