Chandrababu assures telangana tdp leaders

Chandrababu assures Telangana TDP leaders, Chandrababu to get power in Telangana, Babu to stay at Hyderabad till he gets power to TDP

Chandrababu assures Telangana TDP leaders

తెలంగాణాలో అధికారం వచ్చేంతవరకు ఇక్కడే ఉంటానంటున్న చంద్రబాబు

Posted: 06/07/2014 09:50 AM IST
Chandrababu assures telangana tdp leaders

ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించినట్లుగానే తెలంగాణాలోనూ అంతిమ విజయం తమ పార్టీదేనంటూ చంద్రబాబు ధీమావ్యక్తం చేస్తున్నారు.  అప్పటివరకు మకాం హైద్రాబాద్ లోనేనని, ఆ తర్వాతనే సీమాంధ్రకు మారుస్తానని ఆయన అంటున్నారు.  

శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎన్నికల ఫలితాలను సమీక్షించిన చంద్రబాబు తెలంగాణాలో కాంగ్రెస్ ఎలాగూ తుడిచిపెట్టుకుపోయింది, ఇక తెరాస తో తలపడటం కోసం పార్టీని తెలంగాణా రాష్ట్రంలో బలోపేతం చెయ్యాలంటూ చెప్పారు.  ఆ లక్ష్యంతోనే వారంలో ఒకరోజు తెలంగాణాలో పనిచేస్తానని కూడ ఆయన అన్నారు.  

తెలంగాణాలో తెదేపాకి, మిత్రపక్షమైన భాజపాకి వచ్చిన వోట్లను పరిశీలించి వాటిని విశ్లేషిస్తూ తెలంగాణాలో ఓటమికి గల కారణాలను శోధించారు.  తెదేపా తెలంగాణా నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, తలసాని ఇంకా నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లు పాల్గొన్న ఆ సమావేశంలో చంద్రబాబు తెలంగాణా లో అధికారం సాధించే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.  గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలలో తెదేపా సత్తా చూపుతుందన్న ఆశాభావాన్ని ఆయన వెల్లడిచేసారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపడుతున్నా, తను అనుకున్నది సాధించేంతవరకూ హైద్రాబాద్ ని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేసారు.
దీనితో, ప్రమాణస్వీకార ఏర్పాట్లు, తాత్కాలిక సచివాలయానికి గుంటూరులో ఏర్పాట్లు జరుగుతున్నా, నేను దూరంగా వెళ్ళటం లేదు సుమా అన్న సంకేతాలు తెదేపా నాయకులకు భరోసా కోసం ఇస్తూ, ఇతర తెలంగాణా పార్టీల నాయకులకు కూడా అందజేసారాయన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles