Kcr not attending chandrababu swearing in ceremony

KCR not attending Babu swearing in, KCR Visists Delhi at the time of Babu swearing in, KCR meets PM and Center Ministers at Delhi, KCR meets President at Delhi

KCR not attending Chandrababu swearing in ceremony

బాబు ప్రమాణస్వీకారానికి కెసిఆర్ దూరం

Posted: 06/06/2014 10:33 AM IST
Kcr not attending chandrababu swearing in ceremony

ప్రమాణస్వీకారానికి రానని కెసిఆర్ తిరస్కరించటం జరగలేదు కానీ, చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం రోజున తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి దూరంగా వెళ్తున్నారు!  

ఈరోజు సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్న కెసిఆర్ శనివారం అక్కడ ప్రధాన మంత్రి, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.  ఆదివారం రాష్ట్రపతిని కలుస్తారు కాబట్టి జూన్ 8 న ఆయన ప్రమాణస్వీకార వేడుకలకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు.  అందువలన ప్రత్యేకంగా రావటం లేదు అని ఆయన చెప్పకపోయినా జరిగేది అదే!

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రికి కూడా ఆయన ఆహ్వానం పంపించారు.  కానీ మోదీ సమయం లేక రాలేకపోతున్నానని జవాబిచ్చారు.  

సమయం లేదు అని అంటే కూడా అర్థం అదే.  నిజానికి ఎవరికైనా రోజులో ఉండేది 24 గంటలే.  రాలేకపోతున్నా అంటే అక్కడికి రావటానికి ప్రాధాన్యతనివ్వటం లేదనే అర్థం.  అక్కడికి వచ్చేదానికంటే ఎక్కువ అవసరమైన పని అని నేను అనుకుంటున్నదానికి హాజరవటానికి వెళ్తున్నా అని అర్థం.  చంద్రబాబు ప్రత్యేకంగా కెసిఆర్ ఫోన్లో ఆహ్వానించారు కానీ అప్పటికే ఢిల్లీ పర్యటన ఖరారైందని, అందువలన రాలేకపోతున్నానని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి కాని, మోదీ ప్రమాణ స్వీకారానికి కానీ దేశ విదేశాలనుంచి వెళ్ళినవాళ్ళందరికీ వేరే ఏ పని లేదని కాదు!  అందరికీ పనులుంటాయి కానీ ఆ ఇతర పనులకంటే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళటానికే వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి దానికి హాజరయ్యారు! 

దేశంలో పలు ప్రాంత ప్రజలు వ్యతిరేక దృష్టితో చూసే అగ్రనాయకులు పాకిస్తాన్ నుంచి శ్రీలంక నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి.  అందువలన కెసిఆర్ కి సీమాంధ్రలో భద్రత లేదేమో అనే వాదన కూడా సరికాదు.   పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు.  

నిజంగా కూడా భౌతికంగా ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితులుంటాయి ఒక్కోసారి.  కానీ కెసిఆర్ కి భౌతిక సమస్యేమీ కాదు.  తను చెయ్యదలచుకున్న పనులను ఢిల్లీలో ఒకరోజు ముందైనా చేసుకోవచ్చు, ఒకరోజు తర్వాతైనా చేసుకోదగ్గవే.  కానీ ఆయన ఆ రోజే చెయ్యదలచుకున్నారు.  కాబట్టే ఆ రోజు ఆయనకు సమయం చిక్కటం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles