Trs faces problem with farm loan waiving

TRS faces problem with farm loan waiving, Farm loan waiving exercise of TRS Govt, Unconditional Farmer loans waiver demanded by opposition

TRS faces problem with farm loan waiving

ఇప్పుడు తెలిసొస్తంది అధికారంలో ఉండటం ఎంత కష్టమో!

Posted: 06/06/2014 11:12 AM IST
Trs faces problem with farm loan waiving

అధికారంలో ఉన్నవాళ్ళు ఏ పని చేసినా ప్రతిపక్షం నుంచి విమర్శలే వస్తుంటాయి!  అంతేకాదు, మంచిపనికి కూడా మసిపూసేసి దాని విలువను తగ్గించేస్తుంటారు.  ఒక్కోసారి చెయ్యబోయే పనిని ముందుగా చెయ్యాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది.  అప్పుడు చెయ్యాలా వద్దా అన్నది అధికారపక్షానికి అర్థం కాదు.  చేస్తే వాళ్ళు చెప్పినందుకు చేసినట్లవుతుందేమో, తాము చేసినట్లుగా కనపడదేమో అనే భయం!  చేసే పని కాస్త కష్టంగా ఉన్నప్పుడు కాస్త అటూ ఇటూగా చేద్దామనుకుంటే అందులోనూ విమర్శలు వస్తాయి.  

ఇప్పుడు అలాగే ఉంది తెలంగాణాలో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి పరిస్థితి.  ఎన్నికల హామీలో రైతు ఋణాలను మాఫీ చేస్తామని చెప్పినట్లుగానే చెయ్యబూని అందులో కొన్ని షరతులతో చెయ్యబోతుంటే, షరతులు లేకుండా ఋణమాఫీలు జరిగిపోవాలంటూ సిపిఐ డిమాండ్ చేస్తోంది.

ఎన్నికల హామీలలో లక్షరూపాయల వరకు తీసుకున్న ఋణాలను మాఫీ చేస్తామని చెప్పారు కానీ కేవలం 2013-14 లో తీసుకున్న ఋణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కెసిఆర్ చెప్పలేదంటూ సిపిఐ, భాజపా, తెదేపా కూడా విరుచుకుపడ్డాయి.  బేషరతుగా ఋణమాఫీలను చెయ్యకపోతే ప్రజాపక్షాల నుంచి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని కూడా విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామంటూ ఉద్యమ పార్టీనే భయపెడుతున్నారు విపక్షనేతలు.  ఇప్పటివరకు తెరాస చేసింది కూడా అదే-  ఉద్యమమే.  కానీ ఇప్పుడు స్థానం మారిపోయేటప్పటికి ఉద్యమమనే వజ్రపుటుంగరాన్ని ఆ పార్టీకే చూపిస్తున్నాయి విపక్షాలు.  "ఇప్పడు తెలిసొచ్చిందా ప్రభుత్వాన్ని నడపటం కష్టం, కానీ ప్రశ్నించటం సులువని!" అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే, ఎప్పుడు మాట్లాడేది అప్పుడు మాట్లాడాలన్నది రాజకీయ పార్టీలకు తెలిసిన విద్యే.  తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన గోపీచంద్ హీరో వేషం వేసినప్పుడు డైలాగ్ లు మారిపోవా.  హాస్య నటుడు సునీల్ హీరోగా రాలే.  హీరోగా నటించిన జగపతిబాబు విలన్ అవతారమెత్తలే.  ఏ పాత్రలో ఉంటే ఆ డైలాగ్ లు చెప్పవలసివుంటుంది అంతే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles