Ysrcp mla criticizes babu swearing in expenditure

YSRCP MLA criticizes Babu swearing in expenditure, Chandrababu spending 20 to 30 crores for swearing in ceremony, Planes and choppers for Babu ceremony

YSRCP MLA criticizes Babu swearing in expenditure

ఇంకా కొలువుతీరలేదు- బాబు పై విమర్శలు

Posted: 06/06/2014 09:46 AM IST
Ysrcp mla criticizes babu swearing in expenditure

"ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చెయ్యాలా, అందుకోసం హెలికాప్టర్లను, విమానాలను ఉపయోగించాలా, వసూలైన విరాళాలను 30 కోట్ల రూపాయల మేరకు వేడుకలకు ఖర్చు పెట్టాలా, ఆ పనులను కూడా తమవారికే అప్పజెప్పి వాళ్ళకి ఆదాయ వనరులను సమకూర్చాలా, ఆ విధంగా అప్పుడే అవినీతికి దార్లు తీస్తున్నారు!" అంటూ వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

ప్రతిపక్షాలు ఉండాలి, అవి అధికార పక్షాలను నిలదీయాలన్నది నిజమే కానీ ఇంకా అధికారం రాకముందే, ప్రభుత్వం ఏర్పడకముందే ప్రతిపక్ష హోదాలో మాట్లాడటం రాజకీయాల్లో సమంజసమేనేమో!  కానీ వినటానికి మాత్రం కాస్త అనుచితమనిపిస్తోంది!

డబ్బు ఖర్చుపెట్టటం ఎప్పుడూ తప్పు కాదు.  డబ్బు దాచుకోవటం తప్పు.  డబ్బు వినియోగం లేకుండా మూలన పెట్టటం తప్పు.  ఎందుకంటే డబ్బు సర్క్యులేషన్ లో ఉందంటే, ఆ పని ఏదైనా సరే కొందరికి ఉపాధి లభించినట్లే.  'ప్రజలు కష్టాల్లో ఉన్నారు' అని అంటే అందుకేగా మరి ఉపాధి కల్పించింది!  అలా పనులు చెయ్యకుండా ఒట్టిగా పంచుకుంటూ తిరగాలా? 

సరే ఖర్చు పెట్టటం తప్పని అన్నారు.  పొదుపును పాటించి ఆ డబ్బుని కూడా ప్రజలకే పంచిపెట్టమని అంటున్నారు బాగానే ఉంది కానీ, పనుల్లో మళ్ళీ అవినీతేమిటి? 

ప్రతిపనిలోను తప్పకుండా వెనకేసుకోవటం ఉంటుంది, ఆ అవకాశాన్ని చంద్రబాబు తనవాళ్ళకే ఇస్తున్నారు, అలా కాకుండా అలా ఇతరులను కూడా వెనకేసుకోనిస్తే బావుంటుందన్న సూచన ఎంత అసంబద్ధంగా ఉంది అంటున్నారు తెలుగు దేశం నాయకులు.  అసలు అవినీతి ఉండగూడదని కోరుకోవాలి కానీ, అవినీతికి అస్మదీయులకు అవకాశం ఇస్తున్నారనటం బావుందా.  

ప్రజాధనం కాకుండా వ్యక్తిగతంగా ఖర్చు పెట్టినప్పుడు దాన్నింకా ప్రోత్సహించాలి ఎవరైనా.  ఈ పేరు మీద ఎందరికో భృతి ఏర్పడుతుంది కాబట్టి.  అవసరాల్లో ఉన్న ప్రజలను బిచ్చగాళ్ళను చేసేబదులు వాళ్ళకి ఆదాయవనరులను కలిగించటం మంచిదే కదా అంటున్నారు తెదేపా నేతలు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles