Governor invites tdp chief babu to form government in residuary ap

Governor Invites TDP Chief Babu, Babu to Form Government in AP, TDP chief N. Chandrababu Naidu, Governor E.S.L. Narasimhan, new Andhra Pradesh Chief Minister, swearing-in ceremony, చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు, నాగార్జున యూనివర్సిటీ, గవర్నర్ నరసింహన్, టిడిఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడు

Governor Invites TDP Chief Babu to Form Government in Residuary AP

బాబు.. త్వరగా కావాలి?

Posted: 06/06/2014 09:17 AM IST
Governor invites tdp chief babu to form government in residuary ap

సీమాంద్రకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. జూన్ ఏనిమిదో తేదీన సాయంత్రం 7.25 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ - గుంటూరు మధ్యలో నున్న నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న పెద్ద మైదానం ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టిడిపి నేతల నుండి అధికారుల వరకు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

అయితే సీమాంద్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టిడిపికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆహ్వానం పంపారు. టిడిఎల్పీ నేతలు గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. టిడిఎల్పీ నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాలని టిడిపి నేతలు గవర్నర్ ను కోరారు.

babu-government-ap

ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన విజన్ తో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే వివిధ అధికారులతో భేటీలు జరుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు చేస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగా విజయవాడలో పారిశ్రామిక వేత్తలతో భేటీ జరిపారు. సీమాంధ్రలో పరిశ్రమల ఏర్పాటుకు 5,600 కోట్ల రూపాయల సహాయం అందిస్తే 25 కంపెనీలు ఏర్పాటు చేయవచ్చని పారిశ్రామిక వేత్తలు సూచించినట్లు తెలుస్తోంది. దీనిద్వారా ఫార్మసీ రంగంలో 25వేల ఉద్యోగాలు, లక్షలాది ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles