India map with telangana as separate state

India Map with Telangana as separate state, Prof Kodandaram inaugurating India Map with Telangana, Telangana in India Map organized by Telangana Vidyavanthula Vedika

India Map with Telangana as separate state

భారత దేశ పటంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా!

Posted: 06/03/2014 02:05 PM IST
India map with telangana as separate state

దేశపటంలో తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా చూపిస్తూ తయారు చేసిన మ్యాప్ ని ఈ రోజు హైద్రాబాద్ లో ఆవిష్కరించటం జరిగింది.  తెలంగాణా విద్యావంతుల వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణా ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరామ్, సీనియర్ జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, సామాజిక వేత్త భూంరావ్, టిఎన్ జివో అధ్యక్షుడు దేవి ప్రసాద్ పాల్గొన్నారు.  

ప్రొ.కోదండరామ్ మాట్లాడుతూ, భౌగోళిక స్థితిని తెలిపే ఈ మ్యాప్ లో తెలంగాణా రాష్ట్రం దేశానికి కేంద్ర బిందువులా ఉందని అన్నారు.  తెలంగాణా రాష్ట్రం మహారాష్ట్ర్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు కూడలిగా ఉండటంతో ఈ రాష్ట్రం మంచి వ్యాపార కూడలిగా రూపొందే అవకాశం ఉందని అన్నారు.  దానికోసం రవాణా సౌకర్యాలను పెంచాలని, దానితో వ్యాపారం వృద్ధి చెందుతుందని అన్నారు.  వస్త్ర పరిశ్రమకు రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన అన్నారు.  

తెలంగాణా రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపిస్తూ భారత దేశ మ్యాప్ ని రూపొందించే చొరవ తీసుకున్నందుకు కోదండరామ్ అభినందనలను తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles