Untimely deaths of political figures in india

Untimely deaths of political figures in India, Accidental deaths of political leaders in India, Assassinations and attacks on political leaders in India

Untimely deaths of political figures in India

నాయకుల అకాల మృత్యువులు

Posted: 06/03/2014 03:47 PM IST
Untimely deaths of political figures in india

ఈరోజు జరిగిన గోపీనాధ్ ముండే అకాల మరణం దేశంలో ఇంతవరకు జరిగిన ఇటువంటి సంఘటనలను గుర్తుచేస్తోంది.  ప్రమాదంలో కాని, దాడిలో కాని, హత్యగావించబడి కాని అకాలమృత్యువు వాతపడిన నాయకులు వీరే-

1975 జనవరి 3-  అప్పటి రైల్వే మంత్రి లలిత్ నారాయణ మిశ్రా చనిపోయారు.  అంతకు ముందురోజు సమస్తిపూర్- ముజప్ఫర్ పూర్ బ్రాడ్ గేజ్ ని ఆవిష్కరిస్తున్న సమయంలో జరిగిన బాంబు దాడిలో ఆయన గాయపడివున్నారు.  

1980 జూన్ 23- కాంగ్రెస్ ఎంపీ, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ విమానాశ్రయంలో విమాన ప్రమాదంలో చనిపోయారు.  

1984 అక్టోబర్ 31- ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన సొంత సెక్యూరిటీ గన్ మెన్ ల చేతనే హత్యగావించబడ్డారు.

1991 మే 21- ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపేరుంబూదూరులో ఆత్మాహుతి దళం చేసిన దాడిలో మరణించారు.

1994 డిసెంబర్ 25- భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ నవంబర్ 29 నాడు ఆనందపూర్ సాహిబ్ కి కారులో వెళ్తుండగా రోపార్ జిల్లా కిరాత్ పుర్ సాహిబ్ సమీపంలో ప్రమాదానికి గురై డిసెంబర్ 25 న మృతిచెందారు.

2000- కాంగ్రెస్ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ రాజస్తాన్ లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

2001- మాజీ కాంగ్రెస్ ఎంపీ మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో మరణించారు.

2002 మార్చి 3- లోక్ సభ స్పీకర్ జిఎమ్ సి బాలయోగి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కైకలూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2004- మేఘాలయా క్యాబినెట్ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2005- హర్యానా కాంగ్రెస్ నాయకుడు రణబీర్ సింగ్ మహింద్రా, ఓపి జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2006- భాజపా నాయకుడు మాజీ కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ ని అతని సోదరుడే కాల్చి చంపాడు.

2006- భాజపా నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి సాహిబ్ సింగ్ వర్మ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

2007- జార్ఘండ్ ముక్తి మోర్చా లోక్ సభ ఎంపీ సునీల్ కుమార్ మహతో జమ్ షెడ్ పూర్ కి 40 కి.మీ దూరంలో ఉన్న ఈస్ట్ సింగభూమ్ జిల్లాలోని బకూరియాలో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తుండగా నక్సల్స్ దాడిలో మరణించారు.  

2009 సెప్టెంబర్ 2- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2011- అరుణాచల ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

2012- తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు ప్రయాణం చేస్తున్న కారు ఆయిల్ టాంకర్ కి ఢీకొనగా ఆయన మరణించారు.

2013- ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్, విసి శుక్లా లను మావోయిస్ట్ లు మాటేసి తుదముట్టించారు.

2014 ఏప్రిల్ 24- వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మల్యే భూమా శోభా నాగిరెడ్డి రోడ్ ప్రమాదంలో మరణించారు.

2014 లోనే ఈ రోజు జూన్ 3న- కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న 8 రోజులకే గోపీనాధ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles