Cm kcr high tension at secretariat in hyderabad

CM KCR-High tension at secretariat, CM Kcr Photo, seemandhra vs Telangana employees, High Tension at Secretariat today

CM KCR-High tension at secretariat in hyderabad, Tension in Secretariat Seemandhra vs Telangana employees

కేసిఆర్ సాక్షిగా సచివాలయంలో ఉద్యోగుల మద్య ఫైటింగ్ !

Posted: 05/30/2014 02:50 PM IST
Cm kcr high tension at secretariat in hyderabad

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసిఆర్ సాక్షిగా.. సచివాలయంలో ఆంద్ర ఉగ్యోగులు, తెలంగాణ ఉద్యోగుల మద్య ఫైటింగ్ జరిగింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల నేత పద్మాచారి ముందుగా కేసీఆర్ నిలువెత్తు ఫొటో తీసుకుని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉద్యోగుల కార్యాలయానికి వచ్చారు.

సచివాలయంలో ఎన్నాళ్లుగానో ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు ప్రకటించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నామని పద్మాచారి ప్రకటించారు.

దీనికి అక్కడే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయించిన ఈ కార్యాలయాన్ని మీరెలా తీసుకుంటారని వారు అడ్డుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘానికి మాత్రమే గుర్తింపు ఉంది. అందుకోసం వారి సంఘానికి సచివాలయ ప్రాంగణంలో ఓ కార్యాలయం కేటాయించడమే కాక, దాని నిర్వహణకు నిధులను కూడా ప్రభుత్వమే ఇస్తోంది.

తెలంగాణ ఉద్యోగులకంటూ ప్రత్యేకంగా కార్యాలయం లేదు. దీంతో ఇప్పుడున్న కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు పద్మాచారి ప్రకటించి, అక్కడ కేసీఆర్ నిలువెత్తు ఫొటో తగిలించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీ కృష్ణ తదితరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, వాదులాట చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో సచివాలయంలోని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles