ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మొదటి సారి .. వద్దు .. వద్దు అన్నారు. నరేంద్ర మోడీ నోటి నుండి వద్దు అనే మాటలు రావటంతో అధికారులు షాక్ తిన్నారు. పేరు కోసం పరుగులు పెట్టే కాలం ఉన్న మోడీ మొదటి సారి వ్యతిరేకించారు. అంది వచ్చిన అద్రుష్టాన్ని .. మోడీ సున్నితంగా.. తొసిపుచ్చారు. పేరు, ప్రఖ్యాతుల కోసం పరుగుతు తీస్తున్న రాజకీయ నాయకులను చాలా మందని మనం చేశాం. కానీ నరేంద్ర మోడీ మాత్రం అలా కాదు.
అసలు ఇంతకీ కథ ఏమిటంటే.. నరేంద్ర మోడీ జీవిత చరిత్రను.. పాఠ్యాంశాల్లో చేర్చాలని , మద్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మోడీ జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఎంపిక చేసి ఆ పాఠ్యాంశంలో పొందుపరిచేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5,6, 7 తరగతులలో ఆ పాఠ్యాంశాన్ని పొందుపరుస్తామని ఆయన వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం 2015-16 నుంచి అమలులోకి వస్తుందని విశదీకరించారు.
అయితే నరేంద్రమోడీ జీవితం సూర్ఫిదాయకమని... ఆయన కథను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేరిస్తే మరింత మంది విద్యార్థులు మోడీలా తయారవుతారని మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పరాస్ జైన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నరేంద్ర మోడీ. వారి ఆశలో పై సుతిమెత్తగా నీళ్లు చల్లారు.
అంతేకాకుండా వారికి కొన్ని సూచనలు కూడా చేయటం జరిగింది జీవించి ఉన్న వ్యక్తుల జీవిత కథలను పాఠ్య ప్రణాళికలలో చేర్చరాదని అభిప్రాయపడ్డారు. మన దేశం ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి ఎందరో మహానుభావులు పాటు పడ్డారని, చిన్నారులు వారి గురించి తెలుసుకోవాల్సి ఉందని మోడీ అన్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశంలో ఎందరో మహనీయులు ఉన్నారని, వారి జీవిత కథలను పాఠ్యాంశాలుగా చేరిస్తే పాఠశాల విద్యార్థులు మరింత స్పూర్తి పొందిన వారు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more