Jnnurm is going to be replaced by fresh mission

JNNURM is going to be replaced by fresh mission, Venkaiah Naidu to start new mission of urban development, Urban Development Ministry sanctions 32819 crores

JNNURM is going to be replaced by fresh mission

జవహర్ లాల్ నెహ్రూ పట్టణాభివృద్ధికి ఆఖరు రోజులు?

Posted: 05/29/2014 06:09 PM IST
Jnnurm is going to be replaced by fresh mission

నరేంద్ర మోదీ కేబినెట్ ల పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిత్వ అధికారాలను చేపట్టిన వెంకయ్యనాయుడు 2005 లో యుపిఏ ప్రభుత్వం స్థాపించిన జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ను రద్దు చెయ్యటానికి సంకల్పించుకున్నారు.  

2012 లో అయిపోయిన ఈ మిషన్ మరో రెండు సంవత్సరాలకు పొడిగించబడింది.  ఈ మిషన్ రెండవ దశకు కేబినెట్ నోట్ తయారైనా, దాని స్థానంలో మరో కార్యక్రమాన్ని రూపొందించబోతున్నామని వెంకయ్య నాయుడు అన్నారు.  రాబోయ్ మిషన్ లో పట్టణాభివృద్ధిలో విశాలంగా చెయ్యటం, నగరంలోని వృధా నీరు, చెత్త మేనేజ్ మెంట్, ప్రజా రవాణా లాంటివి ఉంటాయని ఆయన అంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబాల పేర్లు కూడా దేశంలో కనిపించకుండా దేశవాసులు పూర్తిగా వాళ్ళని మర్చిపోయేట్టుగా చేసే ప్రయత్నమని అప్పుడే దీని మీద విమర్శలు వినవస్తున్నాయి.  ఈ నేపథ్యంలో హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ అనే పేరుని మారిస్తే ఊరుకునేది లేదని కొందరు కాంగ్రెస్ నాయకులంటున్నారు.  

మరోపక్క వెంకయ్య నాయుడు 100 స్మార్ట్ సిటీలను నిర్మించి అందులో తక్కువ వడ్డీ రేటుకి గృహ ఋణాలు ఇస్తామంటున్నారు.  అందరికీ ఇళ్లు అన్నది ప్రధానంగా పెట్టుకున్న ఆశయమని, 2020 నాటికి దాన్ని సాధిస్తామని అంటున్నారు.  అంటే, 2019 ఎన్నికల సమయానికి  ఆ పని పూర్తికాకపోయినా ఎన్నికల ప్రచారానికది అడ్డురాదు అని కూడా కొందరు నాయకులు అంటున్నారు.  

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళతో పాటు మున్సిపల్, ఎల్ఐసి, బ్యాంక్, రైల్వే ఉద్యోగులకు గృహాలను సమకూర్చవలసిన బాధ్యత ఆయా రంగాలకు ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.  

ఈ ప్రోజెక్ట్ లకు అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే 32819 కోట్ల రూపాయల నిదులను కేటాయించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles