16th loksabha first meet on june 4

16th Loksabha first meet on June 4, Loksabha June 4 to 12, protem Speaker Kamalanath, Lok Sabha Speaker election on June 6

16th Loksabha first meet on June 4

కొలువుతీరనున్న 16 వ లోక్ సభ

Posted: 05/29/2014 05:17 PM IST
16th loksabha first meet on june 4

16 వ లోక్ సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో పార్లమెంట్ జూన్ 4 నుంచి 12 వరకు కొలువుతీరనుంది.  స్పీకర్ ని నియమించేంత వరకు కమలనాధ్ ప్రోటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు.  

4.5 తేదీల్లో కొత్తగా పార్లమెంట్ కి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగి, 6 వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది.  

9వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

ఈ వివరాలను తెలియజేసిన పట్టణాభివృద్ధి శాఖ, పార్లమెంట్ వ్యవహారాల శాఖలను నిర్దేశిస్తున్న వెంకయ్య నాయుడు తెలియజేస్తూ పోలవరం ప్రాజెక్ట్ మీద ఆర్డినెన్స్ గురించి మరో సారి స్పష్టం చేసిందేమిటంటే అది గత ప్రభుత్వం చేసిన నిర్ణయం.  గత పార్లమెంటులో చేసిన నిర్ణయమే ఇప్పడు ఆర్డినెన్స్ గా వచ్చిందని వెంకయ్య నాయుడు వివరణనిచ్చారు.  కేంద్రానికి ఆంధ్ర తెలంగాణా రెండు ప్రాంతాలు సమానమేనని తెలియజేసారు.

అర్డినెన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు వెంకయ్యనాయుడు కలిసి చేసిన కుట్ర అని ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన చేసిన తెలంగాణా నాయకులు ఆరోపించారు.    

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles