Tdp naidu writes letter to governor over threat from gangireddy

Chandrababu vs gangireddy, Chandrababu Naidu Letter To Governor, Chandrababu Naidu Threat From Gangireddy, TDP.

TDP Naidu writes Letter to Governor Over Threat From Gangireddy, Chandrababu Naidu Letter To Governor Over Threat From Gangireddy, Chandrababu Naidu Threat From Gangireddy

రెడ్డి గారితో నాకు ప్రాణహానీ ఉంది : బాబు

Posted: 05/24/2014 08:23 AM IST
Tdp naidu writes letter to governor over threat from gangireddy

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఇప్పుడు ప్రాణం భయం పట్టుకుంది. సీమాంద్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో ఆయనే నాకు రెడ్డి గారి నుండి ప్రాణాహనీ ఉందని ఆయన మీడియా ముందు చెబుతున్నారు. అంతేకాదు.. తనలో ఉన్న భయాన్ని .. నేరుగా తీసుకెళ్లి.. గవర్నర్ నరసింహన్ చేతిలో పెట్టారు. దీంతో గవర్నర్ చంద్రబాబు చెబుతున్న మాటలకు , ఆయన రాసిన లేఖ చదివి ఖంగారు పడినట్లు తెలుస్తోంది.

తొమ్మిదేళ్ల పాటు ఆంద్రపదేశ్ ముఖ్యమంత్రిగా, పదేళ్లు పాటు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబులో ఇంత భయం ఎక్కడుందని .. గవర్నర్ లోతుగా విచారిస్తే.. అసల నిజం బయటపడింది. అసలు ఇంతకీ ఈ రెడ్డిగారు ఎవరు? అని అనుకుంటున్నారా? ఆయన అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి.

మరికొద్ది రోజుల్లో సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో బాబు గవర్నర్ కు లేఖ రాశారు. కొందరి నుండి ప్రాణహాని ఉందని..తనకేమైనా జరిగితే పోలీసు యంత్రాంగానిదే బాధ్యత అంటూ లేఖలో హెచ్చరించారు. అయితే ఆయన ఓ వ్యక్తి గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. ఆయనే 'కొల్లం గంగిరెడ్డి'.

అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని తక్షణమే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోయారు. గంగిరెడ్డి విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాబు డిమాండ్ చేశారు.

గంగిరెడ్డి ఎవరు ?babu-gangireddy

కొల్లం గంగిరెడ్డి అలిపిరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పలు క్రిమినల్ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయని బాబు పేర్కొంటున్నారు. చంద్రబాబు రాసిన లేఖపై గవర్నర్ నరసింహన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles