Modi s facebook page followers largest in the world

Modi's facebook page followers largest in the world, Facebook page of Narendra Modi followed by maximum, Modi next to Obama in politicians followed on facebook

Modi's facebook page followers largest in the world

ఫేస్ బుక్ లో మోదీకి అమితాదరణ

Posted: 05/21/2014 03:27 PM IST
Modi s facebook page followers largest in the world

ప్రధానమంత్రిగా నియమితులైన నరేంద్ర మోదీ ఫేస్ బుక్ పేజ్ కి ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఆదరణ లభిస్తోంది.  ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఆయన ఫేస్ బుక్ పేజీకి వచ్చిన ఆదరణ చరిత్ర సృష్టిస్తోంది.  ఇంతవరకు ఎవరికీ అందని ఖ్యాతి అది.  ఈ విషయాన్ని ఆ సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ అధికారే ప్రకటించారు.  

రాజకీయనాయకుల ఫేస్ బుక్ పేజ్ లను అనుసరించటంలో నరేంద్ర మోదీ రెండవ స్థానంలో ఉన్నారు.  అందులో మొదటి స్థానం అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాది.  

రెండవ స్థానంలో ఉన్న రాజకీయనాయకుడిగా నరేంద్ర మోదీ కి ఫేస్ బుక్ అభిమానులు 15.245 మిలియన్లకు చేరుకున్నారు.  

ఫేస్ బుక్ కి చెందిన ఆండీ స్టోన్ మాటల్లో చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుడిగానూ, ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధిగానూ ఆదరణ పెరుగుతూ పోతోంది.  ఇదే కాకుండా ఎన్నికలు మొదలైన దగ్గర్నుంచి కౌంటింగ్ వరకూ విపరీతమైన ఆదరణ కనిపించటమే కాకుండా, ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ మధ్య ఎన్నికల మీద వ్యాఖ్యానాలు కూడా బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది.  

మోదీ తర్వాత రెండవ స్థానంలో 5.434 మిలియన్ల అభిమానులతో అరవింద్ కేజ్రీవాల్, 2.152 మిలియన్ల అభిమానులతో కుమార్ విశ్వాస్, 2.089 మిలియన్ల అభిమానులతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, 1.594 మిలియన్ల అభిమానులతో భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఉన్నారు. 

దటీజ్ మోదీ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles