Wardwise counting of votes not right ec says

ward wise counting of votes not right EC says, EC recommends cluster counting, Cluster counting better than booth wise counting EC says, PIL on ward wise counting of votes

wardwise counting of votes not right EC says

వార్డువారీ ఓట్ల లెక్కింపు సరి కాదు-ఈసి

Posted: 05/21/2014 04:07 PM IST
Wardwise counting of votes not right ec says

ప్రతివార్డు కౌంటింగ్ ని వెల్లడిచెయ్యటం సరికాదని ఈసి అభిప్రాయపడుతోంది.  దీనివలన గోప్యత తగ్గిపోతుందని, సీక్రెట్ బ్యాలెట్ ఉద్దేశ్యానికి నష్టం జరుగుతుందని, దానికంటే క్లస్టర్ కౌంటింగ్ మంచి పద్ధతని, కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకి విన్నవించుకోవటం జరిగింది.  

జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి పంజాబ్ కి చెందిన అడ్వకేట్ ఫైల్ చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రతి పోలింగ్ బూత్ ఫలితాలను విడివిడిగా ప్రకటించటం సరికాదని ఈ పద్ధతిని నిలిపివేయాలని కోరటం జరిగింది. దీనికి అనుకూలంగా ప్రకటన చేసిన ఎన్నికల కమిషన్ ని అఫిడవిట్ ని ఫైల్ చెయ్యమని కోరుతూ సుప్రీం కోర్టు విచారణను జూలై 7 కి వాయిదా వేసింది.  

ఈలోపులో దీనిమీద స్పందించి రెండు వారాలలో ఫైల్ చెయ్యవలసిందిగా కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది.  

ప్రతి వార్డ్ కాకుండా నియోజకవర్గానికంతటికీ కలిపి వోట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడి చెయ్యటం వలన వైషమ్యాలు, రాజకీయంగా పగలు పెరిగే అవకాశం తగ్గిపోతుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles