Pawan kalyan rejects political berths

Pawan Kalyan rejects political berths, TDP and BJP call Pawan Kalyan, Pawan Kalyan demands in peoples interest

Pawan Kalyan rejects political berths

పదవులొద్దు కానీ డిమాండ్లున్నాయంటున్న పవన్

Posted: 05/21/2014 02:24 PM IST
Pawan kalyan rejects political berths

నిస్వార్థంగాను, ఎన్నికల ప్రచారంలో నిర్విరామంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలకు విజయం సాధించటంలో భాగస్వామ్యం వహించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఇరు పార్టీల నుంచి ప్రభుత్వాన్ని నడిపే పనిలో రాజకీయంగా హోదాని కల్పించటానికి ఆహ్వానం వచ్చినా, పవన్ కళ్యాణ్ అవేమీ వద్దంటున్నారు.  అయితే ఆయనకి ఉన్న డిమాండ్లలో కూడా నిస్వార్థత కనిపిస్తుంది.  

ఎన్నికల ముందే పార్టీని స్థాపించి, ఎన్నికలలో పోటీయే చెయ్యకుండా ఒక్క ఎంపీ కూడా మద్దతుగా పక్కన లేకుండానే పవన్ కళ్యాణ్ విలువ రాజకీయంగా బాగా పెరిగింది.  పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ని అతిథిగా హాజరవటానికి ఆహ్వానం వచ్చిందంటే నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ప్రాముఖ్యత ఎంతన్నది అర్థమౌతోంది.  భాజపా తెదేపా కూడా పవన్ కళ్యాణ్ తో ఉన్న మంచి సంబంధాలను నిలబెట్టుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారు.  

అయితే పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని తనకోసం కాకుండా నిస్వార్థంగా ఉపయోగించుకోదలచుకున్నారు.  అందువలన ఆయన ఈ ఐదు డిమాండ్లు నెరవేర్చమని మాత్రమే కోరుతున్నారు.  అవి- రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, మహిళలకు భద్రత కల్పించటంలో అవసరమైన చట్టాలు, సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి కావలసినన్ని నిధులు, వ్యవసాయదారులు, చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్లు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles