Kejriwal apologizes delhi people

Kejriwal apologies to Delhi people, AAP Convenor Arvind Kejriwal apologizes, Former Delhi Chief Minister Kejriwal apologizes

Kejriwal apologies to Delhi people

ఢిల్లీవాసులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్

Posted: 05/21/2014 02:12 PM IST
Kejriwal apologizes delhi people

అదృష్టం ఒకసారే తలుపుతడుతుందని చెప్తారు.  దాని అర్థమేమిటంటే అదృష్టం కలిసివచ్చినపుడు దాన్ని కాపాడుకోవాలి కానీ, మళ్ళీ మళ్ళీ కలిసివస్తుందన్న నమ్మకంతో ఉండవద్దని.  అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేవలం 49 రోజులే పనిచేసి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నప్పుడే అన్నా హజారే వ్యాఖ్యానించారు కేంద్రంలో గద్దె ఎక్కుదామని కేజ్రీవాల్ ఆశపడతున్నారని.  ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా వాళ్ళ నమ్మకాలను వమ్ము చేస్తూ రాజీనామా చెయ్యటం ఒకపక్క రాజకీయ ప్రయోజనంలో చేసిన వేగిరపాటు చర్యగా కనిపించటమే కాకుండా, ఆయన బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోంది.  

ఉద్యమాలు నిరసనలకే అలవాటు పడ్డ కేజ్రీవాల్ పని చెయ్యవలసి వచ్చినప్పుడు ముఖం చాటేసారనే అపఖ్యాతిని ఆయన మూటగట్టుకున్నారు.  కొండని ఢీకొట్టి ఉన్న కొమ్ములు పొగొట్టుకున్నట్లుగా, ఎత్తైన కొండలా నిలబడ్డ నరేంద్ర మోదీని ఢీకొట్టే ప్రయత్నంలో ఉన్న ముఖ్యమంత్రి పదవినీ, ఆశించిన ఎంపీ సీటునీ పొగొట్టుకున్నారు కేజ్రీవాల్.  

అయితే, చేసిన తప్పు తెలిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది.  బయటే కాకుండా ఢిల్లీలో రోడ్ షోల సమయంలో జరిగిన దాడులవలన అసలు విషయం అవగతమైనా అప్పటికే కాలాతీతమైపోయింది, వెనక్కి తిరిగి వెళ్ళే దారి మూసుకుపోయింది.  

అందువలన ఇప్పటికైనా రాజకీయ చరిత్రలో మరుగునపడిపోకుండా ఉండటం కోసమైనా చెయ్యాల్సిన పని చేసారు అరవింద్ కేజ్రీవాల్.  అదేమిటంటే పబ్లిక్ గా ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పటం, అది కూడా తనని ముఖ్యమంత్రిగా నిలబెట్టిన ప్రజల అనుమతి తీసుకోకుండా అర్ధాంతరంగా ఆ పదవిని వదిలిపెట్టినందుకు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles