Congress party makes record in getting defeated too

congress party makes record in getting defeated too, 150 Congress leaders lost deposits, Record defeat in State elections, Congress former ministers too lost in Seemandhra

congress party makes record in getting defeated too

కాంగ్రెస్ పార్టీ సృష్టించిన మరో చరిత్ర!

Posted: 05/19/2014 11:54 AM IST
Congress party makes record in getting defeated too

రాష్ట్రంలో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరో చరిత్రను సృష్టించింది.  అదేమిటంటే, ఊకుమ్మడిగా డిపాజిట్లను కోల్పోవటం.  జాతీయ రాజకీయపార్టీగా ఘోరాపజయం సంప్రాప్తించినా, 150 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికలలో డిపాజిట్లను కోల్పోయి స్వతంత్ర భారతంలో ఇంతవరకు లేని చరిత్రను సృష్టించారు.  ప్రజల నుంచి ఇంత ఘోర పరాభవాన్ని ఇంతవరకు ఎన్నడూ చూడని కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది.  కానీ ఫలితాలు ప్రజలనాడిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.  

కసిగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓటేసిన సీమాంధ్ర వోటర్ల ప్రవర్తనకు రాష్ట్ర విభజన ఒక కారణమైతే, దేశమంతా ప్రబలిన మోదీ ప్రభావం మరో కారణం.  మాజీ మంత్రులు, సీనియర్ నాయకులని లేకుండా కాంగ్రెస్ తరఫున పోటీచేసిన వారందరినీ సీమాంధ్ర ప్రజ తిరస్కరించింది.  150 మందిలో చాలా వరకు 5000 వోట్ల లోపులో వచ్చినవారే.  అందులో 2000 వోట్ల లోపులో ఉన్నవారు కూడా ఉన్నారు.  చాలా కొద్ది మంది 10000 వోట్ల వరకు కూడగట్టుకున్నారు.  మరీ 1000 వోట్లు, అంతకంటే తక్కువ వచ్చి, బిఎస్పీ, పిరమిడ్ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ కంటే కూడా తక్కువ వోట్లను సంపాదించుకున్నారు.  అంటే ఆ వోట్లను వేసినవారు వారు, వారి కుటుంబీకులు, వారి బంధువర్గమే అయ్యుంటుంది.  

మంత్రిగాను, పిసిసి అధ్యక్షుడిగాను పనిచేసిన రఘువీరా రెడ్డి పెనుగొండలో సంపాదించుకున్న వోట్లు కేవలం 16494.  ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ ఆత్మకూరులో పోటీచేసి గెలుచుకున్నవి 8927 వోట్లు.  కొండ్రు మురళి, శైలజానాధ్ లు కూడా డిపాజిట్లు కోల్పోయారు.  

రాష్ట్ర విభజన తర్వాత మేము కొంచెం అధిష్టానంతో పోరాడివుంటే పరిస్థితి ఇంత దయనీయంగా ఉండకపోవునంటూ ఎపిసిసి అధికార ప్రతినిధి ఆర్.పద్మరాజు వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీయే విభజనకు కారణమని ఎన్నికల ప్రచారంలో ఎలుగెత్తి చాటిన ఇతర పార్టీలకు దీటుగా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించలేకపోయారన్నారాయన.  

ఎన్నికల ప్రచార రథసారధిగా చిరంజీవి ప్రతికూలంగా ఉన్న వాతావరణంలో కూడా కష్టపడి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదంటూ పద్మరాజు వాపోయారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles