Jagan stationed at delhi to meet modi

Jagan stationed at Delhi to meet Modi, Defeat of Congress party, Thunderous win of BJP, Jagan to save himself from cases

Jagan stationed at Delhi to meet Modi

మోదీని కలవటానికి ఢిల్లీలో మకాం వేసిన జగన్

Posted: 05/19/2014 02:19 PM IST
Jagan stationed at delhi to meet modi

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలుస్తారని జోస్యం చెప్పినవారి ఫలితాలను పరిశీలించటానికి వీల్లేకుండా కాంగ్రెస్ ఘోర పరాజయం పొందింది.  కాంగ్రెస్ పార్టీ కొన్నైనా సీట్లు సంపాదించుకునుంటే మద్దతిచ్చి రాహుల్ ని ప్రధానిగా చెయ్యటానికి కెసిఆర్ సిద్ధమయ్యారు, ఆ దిశగా ప్రకటన కూడా చేసారాయన.  కానీ ఆ విషయంలో గోప్యతను కాపాడుకుంటూవచ్చారు.  తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే కాంగ్రెస్ సోదిలోనే లేకుండా పోయింది.  అలాంటి పార్టీకి మద్దతునిచ్చినా ఇవ్వకపోయినా ఒకటే కనుక ఆ ప్రస్తావనే రాదిప్పుడు.  

ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ.  ఆ పార్టీ, ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ కూడా అఖండ విజయం సాధించటంతో జగన్ మోదీని కలవటానికి తన బృందంతో అక్కడే మకాం వేసారు.  ఆయనను ఈరోజు కలిసే అవకాశముంది.  

అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జగన్, రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించటానికి, పోలవరం విషయంలో ఆర్డినెన్స్ ని జాప్యం చెయ్యకుండా వెంటనే పాస్ చెయ్యమని కోరటానికి మోదీతో భేటీ అవుతున్నానన్నారు.  

జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అధికారంలోకి వస్తున్న భాజపాతో కలవటానికి చూస్తున్నారని ఇతర పార్టీలు విమర్శించినా, తనను తాను రక్షించుకోవటం తప్పని ఎవరూ అనలేరు.  తనని తాను డిఫెండ్ చేసుకోవటానికి చట్టం కూడా అవకాశమిస్తుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles