Chandrababu to work vijayawada guntur as base

Chandrababu to work Vijayawada Guntur as base, Andhra Pradesh CM designate Chandrababu Naidu, Telugu Desam Party President Chandrababu

Chandrababu to work Vijayawada Guntur as base

గుంటూరు కేంద్రంగా చంద్రబాబు కార్యకలాపాలు!

Posted: 05/19/2014 09:36 AM IST
Chandrababu to work vijayawada guntur as base

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారాలను చేపట్టటానికి సిద్ధంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆదివారం తన అంతరంగంలోని మాటను వెల్లడిస్తూ, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని తాను ముఖ్యమంత్రిగా పని చేస్తానని అన్నారు.  

రాష్ట్ర రాజధాని నిర్ణయం జరిగేవరకు తాను విజయవాడ, గుంటూరు నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తానని అన్న చంద్రబాబు నాయుడు, రాష్ట్రపాలనను సమర్ధవంతంగా జరపటం కోసం హైద్రాబాద్ లో కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చెయ్యవలసివున్నా, చాలవరకు సమావేశాలు, నిర్ణయాలు గుంటూరు నుంచే జరుగుతాయని అన్నారాయన.  అంటే నామమాత్రంగా హైద్రాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి నుంచే హైద్రాబాద్ కి దూరంగా కార్యకలాపాలను నిర్వహించటం మంచిదన్న ఉద్దేశ్యంలో ఉన్నారని తెలుస్తోంది.  

అంతేకాదు తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమితి అఖండ విజయం సాధించటంతో తెలంగాణా ప్రజలు తమ దైన పాలనను ఎంతగా కోరుకుంటున్నారో అర్థమౌతోంది.  అలాంటి సందర్భంలో చంద్రబాబు తన కేంద్రాన్ని హైద్రాబాద్ కాకుండా మరోచోటకి  మార్చుకోవటమే మంచిదని చంద్రబాబు సలహాదారులు అంటున్నారు.  అనధికారికంగా పని మొదలుపెట్టిన ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పనిచెయ్యవలసిన విధానం గురించి ప్రణాళికలు సిద్ధంచేసారు.  రైతు ఋణాల మాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుని వాగ్దానం చేసిన చంద్రబాబు వైయస్ఆర్ కాంగ్రెస్ విమర్శించినట్లుగా సంభవంకాని పనేమీ కాదని, సరైన రీతిలో ఆర్థిక ప్రణాళికలు వేసినట్లయితే తప్పకుండా సాధించగల విషయమేనని ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడుతూ అన్నారు.    

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles