Trs leading in zptc results

TRS leading in ZPTC results, TRS in ZPTC Congress in MPTC, TRS leading in ZPTC, Congress leading in MPTC

TRS leading in ZPTC results in Telangana

తెలంగాణాలో తెరాస ప్రభంజనం

Posted: 05/14/2014 09:09 AM IST
Trs leading in zptc results

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వెనకబడి కాంగ్రెస్ కి తాత్కాలికంగా విజయానందాన్నిచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితి పరిషత్ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో జెండా ఎగురవేసింది.  అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్ జిల్లాలలో తెరాస జెడ్పీలను కైవసం చేసుకుంది.  కాంగ్రెస్ పార్టీ నల్గొండలో మాత్రమే మెజారిటీని సాధించింది.  ఖమ్మంలో తెలుగుదేశం జెడ్పీని గెలుచుకుంటోంది. 46 జెడ్పీ స్థానాల్లో తెదేపా 22 స్థానాలను దక్కించుకుంది.  మెదక్ లో కాంగ్రెస్, తెరాసలకు సమానంగా స్థానాలు దక్కాయి.  

రాత్రి 12.30 వరకు 400 జెడ్పీటిసి స్థానాలకు ఫలితాలు అందగా అందులో 180 స్థానాలు తెరాస ఖాతాలోనే పడ్డాయి.  రెండల స్ధానంలో కాంగ్రెస్ పార్టీ 154 స్థానాలను గెలుచుకుంది.  6303 ఎంపిటిసి స్థానాలకు ఫలితాలు వెలివడగా అందులో 2268 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 1857 స్థానాలను తెరాస దక్కించుకున్నాయి.  మూడవ స్థానంలో తెదేపాకు 1012 స్థానాలు దక్కాయి.  

మొత్తం మీద తెరాస కాంగ్రెస్ మధ్యలోనే ఊగిసలాటలు కనిపించాయి.  జెడ్పిటిసి తెరాస కైవసమైతే, ఎంపిటిసిలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles