Congress defeat in seemandhra parishat elections

Congress defeat in Seemandhra Parishat elections, State bifurcation, Seemandhra Parishat results discourage Congress, Seemandhra voters voted with vengence

Congress defeat in Seemandhra Parishat elections

సీమాంధ్రలో కాంగ్రెస్ ని ఓడించిన నాయకులు

Posted: 05/14/2014 09:29 AM IST
Congress defeat in seemandhra parishat elections

ఒకప్పుడు పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన దెబ్బతో ఒక్కటంటే ఒక్క జిల్లా పరిషత్ ని కూడా దక్కించుకోలేకపోయింది.  
రాష్ట్ర విభజనకు జరగక ముందునుంచే విభజన తంతు జరుగుతుండగానే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఓడిపోయే పందెంలో కాయటమెందుకున్నట్లుగా ఎన్నికలలో నిలబడి అనవసరంగా డబ్బు వృధా చేసుకోదలచుకోలేదు.  ఎంపిటిసిలు మాత్రం కాంగ్రెస్ కి కంటితుడుపు అరకొర అనుకూల ఫలితాలనిచ్చాయి.  
పరిషత్ ఎన్నికలలో గెలుపు బాధ్యతలను వైయస్ హయాంలో మంత్రులకే అప్పజెప్పటం జరిగింది.  పార్టీ అభ్యర్థులను గెలిపించలేకపోయిన మాగంటి బాబు, మారెప్పలు మంత్రి పదవులనే పోగొట్టుకున్నారు.  ఇప్పుడు ముఖ్యమంత్రే లేకపోవటంతో మంత్రులే కాదు మాజీ మంత్రులు, ఎమ్మల్యేలు, ఇతర నాయకులు కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టారు.  పార్టీ బలాన్ని పెంచుకునే దిశగా ఎవరూ పనిచేయలేదు.  ప్రజానాడిని కనిపెట్టిన నేతలు ప్రజాగ్రహానికి గురవకూడదనుకున్నారేమో, పరిషత్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు.  వాళ్ళు అనుకున్నట్లుగానే సీమాంధ్ర ప్రజలు కసిగా వోట్లు వేసినట్లుగా కనపడుతోంది.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles