పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా తెలుసు, దేశంలోనే నాల్గవ స్థానాన్ని సంపాదించటం తెలుసు, రాజకీయాలలోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించటం తెలుసు, పదవులు వద్దు ఈసారి ఎన్నికలలో పోటీచెయ్యనని చెప్పటం విన్నాం, భాజపా తెదేపాలకు మద్దతుగా నిలబడతానని చెప్పటం తెలుసు. కానీ ఆయన మరో అవతారం కింగ్ మేకర్.
తను జనసామాన్యంలోనే కలిసి వుండి అధికారం చేపట్టేవారిని ప్రశ్నించే పని పెట్టుకుంటానన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆ అధికారంలో కూర్చోబెట్టేది కూడా తనే అవటం విశేషం. అలా చేసేవారినే కదా మనం కింగ్ మేకర్ అంటాం.
అంటే, మంచివాళ్ళకి, పని చేస్తారని నమ్మకం ఉన్నవాళ్ళకి అధికారం చేతికిస్తాం కానీ వాళ్ళు తమ పని సక్రమంగా చెయ్యకపోతే మాత్రం తాటతీస్తాం అన్నది పవన్ కళ్యాణ్ పాలసీలా కనిపిస్తోంది.
అయితే ఇదే ప్రజలంతా చెయ్యవలసిన పని. తమకు ప్రతినిధులుగా పనిచేసే నాయకులను ఎన్నుకోవటం, తమ కోసం పని చెయ్యటానికి వాళ్ళకి అధికారమివ్వటం, చెయ్యవలసిన పనిని సక్రమంగా చెయ్యకపోతే వాళ్ళ అధికారాలను వెనక్కి తీసుకోవటం- ఇదే ప్రజలు చెయ్యవలసిన పని. కానీ సంఘటితమవని ప్రజలు ఈ చివరి పని చెయ్యలేరు కాబట్టి ఆ ప్రజల సేనగా జనసేన పార్టీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ, తను మద్దతిచ్చిన వారికి హెచ్చరికలు చేస్తున్నారు.
ఇంతవరకు వోటు వెయ్యటం వరకే ఉన్న అధికారం ఇక నాయకులను నిలదీయటానికి కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమాంటూ కలుగుతోంది. లేదంటే వోటు వేసి గెలిపించిన పాపానికి వోటరు ఐదు సంవత్సరాలు వేచి చూడవలసిందే. మీకు ఉద్యోగం ఇస్తాను కానీ పనిచెయ్యాలి అని పవన్ కళ్యాణ్ నాయకులను శాసించినట్లే అవుతుంది.
సామాన్యంగా కింగ్ మేకర్లు తాము నిలబెట్టినవారికి అండదండలుగా నిలబడి, అధికారం వచ్చిన తర్వాత ఆ లబ్ధిని పొందటమో లేక పరపతిని, సంపదను కూడబెట్టటమో చెయ్యటానికా పని చేస్తారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకులను ప్రజాసంక్షేమంలో పనిచెయ్యటానికి నియమించ పూనుకోవటం విశేషం.
మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఆయుధం ధరించనని, యుద్ధం చెయ్యనని చెప్తాడు. అయినా అర్జునుడు కృష్ణుడినే తనతో పాటుగా, తనకు యుద్ధంలో సాయంగా ఉండాలని కోరుకుంటాడు. యుద్ధం తానుగా చెయ్యకపోయినా అడుగడుగునా కురుక్షేత్ర యుద్ధాన్ని మలుపులు తిప్పించి శత్రు పక్ష కౌరవుల వ్యూహాలను తిప్పికొట్టి పాండవులు గెలిచేట్టుగా చేసింది శ్రీకృష్ణుడే.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, భాజపా తెదేపాలకు మద్దతునిస్తూ, విస్తృతంగా పర్యటిస్తూ వారికి ప్రతిపక్ష నేతలైనవారిని విమర్శనాస్త్రాలతో చిత్తు చేస్తూ ఎన్నికలను వాళ్ళకి అనుకూలంగా విజయపథంలోకి నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ప్రజా చైతన్యంలో ఎంత మార్పు వచ్చిందన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ మద్దతిచ్చినవారి గెలుపు ఎంత వరకన్నది ఫలితాలు వచ్చిన తర్వాత కానీ తెలియదు కానీ, గెలుపు అవకాశాలను పెంచారన్నది మాత్రం నిర్వివాదం. ఆ సంగతి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కూడా అనుకూల సంకేతాలు వస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more