Ballot boxes filled with water

MPTC ZPTC Ballot boxes filled with water, MPTC ZPTC Ballot papers damaged, Damaged ballot boxes severed counting

Ballot boxes filled with water and ballot papers damaged

బ్యాలట్ బాక్స్ లలో చెదలు!

Posted: 05/13/2014 11:40 AM IST
Ballot boxes filled with water

ఎంపిటిసి, జెడ్పీటిసి బ్యాలట్ బాక్స్ లలోకి నీరు చేరి చెదలు కూడా పట్టటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.  తూర్పు గోదావరి జిల్లా విఎస్ లక్ష్మీ కళాశాలలో భద్రపరచిన బ్యాలెట్ బాక్స్ లలో ఆరు బాక్స్ లలో భద్రంగా చేరిన చెదలు వోట్ల లెక్కింపుకోసం తెరవటంతో పాపం డిస్టర్బ్ అయ్యాయి.  గొల్లలమామిడిలో కూడా బ్యాలెట్ బాక్స్ లలో నీరు చేరినట్లు తెలిసింది.
ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాతనే వెల్లడి చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పుడు బ్యాలెట్ బాక్స్ ల భద్రత విషయంలో సందేహాలు వెలిబుచ్చినప్పుడు అలాంటి సాకులు చెప్పవద్దని కోర్టు ఆగ్రహించటం జరిగింది.  
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ  ప్రసాద్ తడిసిన బ్యాలెట్ బాక్స్ లను పరిశీలిస్తున్నారు.  దీనితో వోట్ల లెక్కింపులో అంతరాయం ఏర్పడింది.  
పశ్చిమ గోదావరి జిల్లాలో కోరు మామిడి, తాడిమళ్ళ గ్రామాలలోని ఎంపిటిసి స్థానాలకు చెందిన బ్యాలెట్ బాక్స్ లలో నీరు చేరటంతో వాటిని జాగ్రత్తగా తీసి పరిశీలించటంలో జాప్యం జరుగుతోంది.  
నెల్లూరు జిల్లా కావలి లో కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది.  అక్కడ మరీ చెదల వలన బ్యాలెట్ పేపర్లకు చిల్లులు కూడా పడివున్నాయి.  అభ్యర్థులకు చెందిన ఏజెంట్లు అభ్యంతరాలు తెలపటంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు.  
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles