Spiritual programs in arizona maha ganapathi temple

Maha Kumbhabhishekam in Arizona,Kumbhabhishekam in Arizona,Spiritual programs in Arizona Maha Ganapathi Temple, Erection of temple Vimanam Arizone Ganapathi temple, Placing and Prana prathishtapana of deities

Spiritual programs in Arizona Maha Ganapathi Temple

అరిజోనా మహా గణపతి ఆలయంలో మహా కుంభాభిషేకం

Posted: 05/13/2014 10:26 AM IST
Spiritual programs in arizona maha ganapathi temple

అరిజోనాలో మహా గణపతి ఆలయంలో శుక్రవారం, శనివారం, ఆదివారం మే 9, 10, 11 తేదీల్లో ఆలయ విమాన ప్రతిష్టలు,  దివ్య మూర్తుల ప్రాణ ప్రతిష్టాపన, మహా కుంభాభిషేకం మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.  

kumbhabhishekam2

ఈ కార్యక్రమంలో శ్రీ మహా గణపతి, శ్రీ విశ్వనాధ (పరమశివ), శ్రీ వేంకటేశ్వర ఆలయాలకు మూల ఆలయ విమానం (గోపురం) ప్రతిష్ట, శ్రీ సత్యనారాయణ స్వామి, శివగాగమ సుందరీ సమేత నటరాజ స్వామి మూర్తుల ప్రాణ ప్రతిష్టాపన జరిగింది.  

kumbhabhishekam1

శుక్రవారం మే 9 న ధాన్యాధివాసం, జలాధివాసం లో ఆలయమూర్తులకు ధాన్యం, నీరు సమర్పించటం జరిగింది.  దీప పూజానంతరం శయనాధివాసం- పవళింపు సేవ కోసం శయనం సమర్పించటం జరిగింది.  మహాప్రసాద వితరణతో ఆ రోజు కార్యక్రమం పూర్తయింది.

శనివారం మే 10 న మూలమంత్ర హోమం చేసిన తర్వాత నేత్రోన్మీలనం- అంటే దివ్య మూర్తుల నేత్రాలను తెరవటం జరిగింది.  విమాన కలశ స్థాపన తర్వాత కొత్తగా వచ్చిన దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్ట జరిగింది.  సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం మహా ప్రసాద వితరణ జరిగింది.

 kumbhabhishekam3

ఆదివారం మే 11 న మహా కుంభాభిషేకం జరిగింది.  ఈ కార్యక్రమంలో, కొత్తగా ప్రతిష్టించిన మూర్తులకు మొదటిసారిగా అభిషేకం, అర్చన, ఆ తర్వాత అలంకారాలను నిర్వహించారు.  కొత్తగా ప్రతిష్టించిన సత్యనారాయణ స్వామికి ప్రథమ పూజ చేసారు.  ఆ తర్వాత శ్రీ నటరాజప్రహారోత్సవంలో నటరాజ స్వామి ఊరేగింపు జరిగింది.  మహా ప్రసాద వితరణతో కార్యక్రమం సంపూర్ణమైంది.  

kumbhabhishekam4

సత్యానికి ప్రతిరూపమైన మహావిష్ణవు సత్యనారాయణ స్వామి పూజను ధర్మకామార్థ మోక్ష ప్రాప్తిని ఆశించే కుటుంబాలు చెయ్యటం వలన వారి అభీష్టాలు నెరవేరుతాయని, మహాకుంభాభిషేకం తర్వాత నిర్వహించే ప్రథమ పూజలో పాల్గొంటే ఆ ఫలితం ఎన్నోరెట్లు అధికమౌతుందని వేదాలు చెప్తున్నాయి, భక్తులు విశ్వసిస్తున్నారు కాబట్టి, ఈ కార్యక్రమంలో జరిగిన ప్రథమ సత్యనారాయణ స్వామి పూజలో 1008 భక్తులు భాగం వహించారు.  

అరిజోనా మహాగణపతి ఆలయంలోని మూడురోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రీయంగాను, అత్యంత వైభవంగానూ నిర్వహించటం జరిగాయి.   

అరిజోనాలో జరిగే వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, వేడుకలు, కార్యక్రమాల వివరాలకు WWW.AZWishesh.com ని చూడండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles