Congress party celebrates over municipal results

Congress party celebrates over municipal results, Congress gets more Telangana municipal seats, Congress victory in Telangana

Congress party celebrates over municipal results in Telangana

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు

Posted: 05/13/2014 09:15 AM IST
Congress party celebrates over municipal results

నిన్న వెలివడ్డ మున్సిపల్, నగరపాలిక వోట్ల లెక్కింపులో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది.  కాంగ్రెస్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటూ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన సంతోషాన్ని వ్యక్తపరచారు.  పురపాలక ఎన్నికల విషయంలో తమ అంచనా ఎంతమాత్రం తప్పలేదని ఆయన అన్నారు.  

కాంగ్రెస్ ఆనందానికి ఒక్క పురపాలక, నగరపాలక ఎన్నికలలో అధిక శాతం స్థానాలను గెలుచుకోవటమొక్కటే కాదు ఇంకా కారణాలున్నాయి! 

కాంగ్రెస్ పడిపోయిందంటూ ఇతర పార్టీలు, పత్రికలు ఎలుగెత్తుతున్న తరుణంలో తెలంగాణాలో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను గెలుచుకోవటం పార్టీ నాయకులు, శ్రేణలలో ఊపిరిపోసింది.  ఈ ఫలితాలనే గనక రిఫరెండంగా తీసుకుంటే సార్వత్రిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టే అవకాశం ఉందని ఆశ మొలకెత్తుతోంది.  అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీని మోసగించిందనే భావనతో కసిగా ఉన్న ఆ పార్టీకి తెరాస కంటే ఎక్కువ మున్సిపాలిటీలు కైవసం కావటం నిజంగా ఆనందమే.  

ఇక తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యక్తిగతమైన గెలుపే.  అందుకు కారణం ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వటం మీద పార్టీలో కలకలం రేగుతూ వస్తోంది.  జానారెడ్డి లాంటి నాయకుడికి పిసిసి పగ్గాలిస్తే బాగుండేదని, పొన్నాల నాయకత్వం అంత ఫలితాలనిచ్చేదిగా లేదని సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో ఈ గెలుపు పొన్నాలకు పేరు తెచ్చిపెడుతోంది.  కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో కూడా సత్ఫలితాలనందించిన నాయకుడిగా గుర్తింపు లభించే అవకాశం ఉంది.  ఇక దీనిలాగానే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడితేనా అని అనుకుంటున్నారు.  

ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పోల్స్ ఫలితాలు అమితానందాన్ని కలిగించాయి.  మిఠాయిలు పంచిపెట్టుకుని బాణాసంచా కాల్చిన కాంగ్రెస్ నాయకులు ప్రతివారూ పొన్నాల నోటిని తీపిచేసారు.

మొత్తం 525 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంటే, తెరాస 313, తెదేపా భాజపా కూటమి కేవలం 162 స్థానాలను గెలుచుకున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles