Digvijay confirms his affair with amrita ray

Digvijay confirms his affair with Amrita Ray, AICC General Secretary Digvijay Singh, Rajyasabha TV anchor Amrita Ray

Digvijay confirms his affair with Amrita Ray

టివి యాంకర్ తో సంబంధం వ్యక్తిగతం-దిగ్విజయ్

Posted: 05/01/2014 02:35 PM IST
Digvijay confirms his affair with amrita ray

టివి యాంకర్ తో తనకున్న సంబంధం పూర్తిగా తన వ్యక్తిగతమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.  ఇందులో ఎవరూ కలుగజేసుకోవటం మంచిదికాదని కూడా ఆయన అన్నారు.  

ట్విట్టర్లో తనకు జర్నలిస్ట్ అమృతా రాయ్ తో ఉన్న సంబంధాన్ని అంగీకరించిన దిగ్విజయ్ సింగ్ ఆమె, ఆమె భర్త పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టులో పేపర్లు ఫైల్ చేసారని కూడా తెలియజేసారు.  విడాకులు రాగానే తాము పెళ్ళి చేసుకుంటామని, ఈ విషయంలో ఎవరి జోక్యాన్నీ తాను ఇష్టపడనని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన అంశమని 67 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

ఆయన అమృత రాయ్ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు వెబ్ లో చక్కర్లు కొట్టిన తర్వాత ఆ విషయంలో అందరి ఊహాగానాలకు తెరదించుతూ, దిగ్విజయ్ సింగ్ పై విధంగా ప్రకటన చేసారు.

దిగ్విజయ్ సింగ్ భార్య పోయిన సంవత్సరం క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు.  అమృత రాయ్ రాజ్యసభ టివి లో యాంకర్.  

భాజపాకి చెందిన సుశీల్ కుమార్ మోదీ దిగ్విజయ్ సింగ్ కి ట్విట్టర్లో 67 సంవత్సరాల ప్రాయంలో కూడా ప్రేమాయణం కలిగివున్నందుకు అభినందనలు తెలియజేయగా ఆ మాటలను తిప్పి కొడుతూ, ఈ వ్యాఖ్యలు వాళ్ళ స్థితిని తెలియజేస్తున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్. ఇదంతా సరే కానీ ఇవే వాస్తవాలు, వ్యక్తిగత మైన విషయాలు అన్నవి పార్టీ మారే వరకు మారిపోతుంటాయి.  మొన్నటి దాకా భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ వైవాహిక జీవితం గురించి రకరకాల వ్యాఖ్యలు చేసారు ఇతర పార్టీ నాయకులు.  భార్యనే పట్టించుకోనివాడు దేశ సౌభాగ్యానేమి చూడగలడని, ఎన్నికలలో పోటీ సమయంలో అఫిడవిట్ లలో తన వైవాహిక జీవితం గురించి మోదీ పూర్వం తప్పు ప్రకటనలు చేసారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles