Narendra guntur rally

Narendra Guntur rally, Elections 2014, BJP Prime Ministerial candidate Modi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Narendra Guntur rally, BJP Prime Ministerial candidate Modi

గుంటూరు సభకు హాజరైన భారత భాగ్య విధాతలు

Posted: 05/01/2014 04:53 PM IST
Narendra guntur rally

భారత మాతా కీ జై అంటూ ప్రసంగం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్డియే విజయ శంఖారావం సభకు హాజరైన యువతను భారత భాగ్య విధాతలుగా వారిని తెలుగులో సంబోధించారు.  2014 ఎన్నికలను సీమాంధ్ర తలరాతను మార్చే ఎన్నికలుగా అభివర్ణించిన మోదీ తెలుగువారి పౌరుషం గురించి తనకు తెలుసని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో గుంటూరు నుంచి సత్యాగ్రహంలో పాల్గొన్నారని, మహిళలు పన్నులు చెల్లించకుండా బ్రిటిష్ వారికి ఎదురుతిరిగారని గుర్తు చేసుకున్నారాయన.

తెలుగువారిని అవమానించటం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ఉన్నదేనని, ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను విమానాశ్రమంలో రాజీవ్ గాంధీ అవమానించారని, సంజీవరెడ్డి రాష్ట్రపతి అవకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని, సంస్కరణలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన పివి నరసింహారావు మృతదేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉంచటానికే ఇష్టపడలేదని గుర్తు చేసిన మోదీ పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్ర స్థాయిలోను, ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనూ దోచుకోవటం తప్ప మరేమీ చెయ్యలేదని అన్నారు.  అటువంటి వారి చేతిలోకి సీమాంధ్ర పోతే ఎలా ఉంటుందన్నది ఆలోచించి ఎవరికి వోటెయ్యాలన్న విషయాన్ని నిర్ణయించుకోవాలంటూ మోదీ గుంటూరు సభ నుంచి పిలుపునిచ్చారు.  

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి వదిలిపెట్టేసింది కానీ తాను మాత్రం అలా ఒంటరివాళ్లని చేసి వదిలిపెట్టి పోయేవాడిని కానని, సోదరుడిలా వెంటవుంటానని చెప్పిన మోదీ, చంద్రబాబు దూరదృష్టితో క్రియాశీలిగా సీమాంధ్రను తీర్చిదిద్దే సామర్థం కలవారని, నిస్వార్థంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా తెలుగువారికి మంచి చేసే ఉద్దేశ్యంతోనే పాటుపడుతున్నారని అన్నారు.   

అందువలన కేంద్రంలో ఎన్డియే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చినట్లయితే స్వర్ణాంధ్రప్రదేశ్ గా రూపొందగలదని నరేంద్ర మోదీ తన విశ్వాసాన్ని ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles