ఈసారి సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకం అవటమే కాకుండా దేశ విదేశాలలో కూడా దేశ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చివేస్తున్న ఈ ఎన్నికల మీద ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల కమిషన్ కూడా ఎటువంటి ఆరోపణలకూ తావీయ గూడదన్న విధంగా అత్యంత నియమ నిష్టలతో, కఠినంగా వ్యవహరించటానికి పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే అధికార పార్టీ మీద కాకుండా ఆ కఠినత్వం ప్రతిపక్షాల మీదకు మళ్ళినట్లుగా విమర్శలు వస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తాను ఇంత వరకు ఏ కేసులోనూ ఇరుక్కోలేదని, కనీసం స్కూటర్ రాంగ్ రూట్ లో నడిపిన కేసు కూడా తన మీద నమోదవలేదని, అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఏప్రిల్ 30 న తను కమలం చూపించినందుకు కేసు పెట్టిందని, తాను చూపించిందేమీ కత్తికాని, తుపాకి కాని కాదని కేవలం తామరపువ్వని అన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిస్పృహలో ఉందో దీన్నిబట్టి అర్థమౌతోందని కూడా మోదీ విమర్శించారు.
చంద్రబాబు నాయుడు వోటేసి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ కి వంద మీటర్ల దూరంలో ఉన్నప్పుడు తాను భారతీయ జనతా పార్టీకి వోటు వేసానని చెప్పిన మాటలు మీడియాలో రాగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి భన్వర్ లాల్ చంద్రబాబు వేసిన వోటుని అనర్హత వోటుగా పరిగణిస్తామని అన్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చెయ్యటం జరిగింది. భన్వర్ లాల్ తన పరిధిలో లేని విషయాల మీద మాట్లాడుతున్నారని తెదేపా అభియోగం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more