Chandrababu vows to work hard for the state

Chandrababu vows to work hard for the State, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Chandrababu vows to work hard for the State

నారా చంద్రబాబు అనబడే నేను......

Posted: 05/01/2014 10:41 AM IST
Chandrababu vows to work hard for the state

నా ప్రమాణ స్వీకారం సీమాంధ్రలోనే జరుగుతుందని చంద్రబాబు బుధవారం తిరుపతి సభలో తన ఆకాంక్షను వెలిబుచ్చారు.  అప్పటి నుంచి సీమాంధ్రలోనే సీమాంధ్ర అభివృద్ధికోసమే పనిచేస్తానని చంద్రబాబు వాగ్దానం చేసారు.  

రాష్ట్ర విభజన జరిగిన విధానం తెలుగు ప్రజలకు అవమానం కరంగా ఉందని, దానిమీద సీమాంధ్ర ప్రజలు కసిగా ఉన్నారని, అయితే ఆ కసిని పాజిటివ్ గా మార్చుకుని అభివృద్ధికి ఉపయోగిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  మీతో పాటు నేనూ కసిగా పనిచేస్తా.  చెట్ల కింద కూర్చునైనా సరే పనిచేద్దాం.  పది సంవత్సరాలు కాదు ఆరు నెలల్లోనే అభివృద్ధిని సాధిద్దాం అని చంద్రబాబు అన్నారు.  

రాష్ట్రాన్ని ఇష్ట్రారాజ్యంగా సోనియా గాంధీ విభజిస్తే దానిలో కెసిఆర్, జగన్ లు భాగస్వామ్యం వహించారని అన్న చంద్రబాబు, అప్పులు మాత్రం జనాభా ప్రాతిపదికన పంచుతారట కనీ ఆదాయాన్ని మాత్రం అలా పంచరట అని విమర్శించారు.  విభజన తర్వాత ఆ అప్పులూ చెల్లించాలి, రాష్ట్రాన్ని నడపటానికి అవసరమైన ఖర్చునూ భరించాలి.  జీతాలు కూడా సక్రమంగా ఇవ్వగలమో లేదో తెలియదు.  అలాంటప్పుడు సంక్షేమ పథకాలను ఎంతవరకు అమలు చెయ్యగలమో కూడా తెలియదు.  వీటన్నిటికీ కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో మోదీ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టినట్లయితేనే  ఆంధ్ర ప్రదేశ్ కి అవసరమైన మద్దతు లభిస్తుందని అన్నారాయన.  

నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ కి అండగా నిలబడతారని, అందువలన ఆయనను గెలిపించటం కోసం ప్రయత్నం చెయ్యాలని చంద్రబాబు అన్నారు.  కెసిఆర్ చెడబుట్టాడని, తన దగ్గర పాఠాలు నేర్చుకుని తనకే పంగనామాలు పెట్టాడని అన్న చంద్రబాబు తన లాభసాటైన తన వృత్తిని పక్కకు పెట్టి నిస్వార్థంగా రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ప్రశంసించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles